విధాత: ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలిచినా అవన్నీ బీజేపీ ఖాతాలోకే అని ఆ మధ్య మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. వైసీపీ, దీనర్థం టీడీపీ, జనసేన ఈ పార్టీల తరఫున ఎంపీలుగా ఎవరు గెలిచినా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి గంపగుత్తగా మద్దతు ఇస్తారు. కాబట్టి ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా 25 స్థానాలు మావే అన్నట్టు బీజేపీ పెద్దలు భావిస్తారు.
నాడు ఆయన అన్న మాటలు నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే విశాఖలో పర్యటించిన ప్రధాని పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పలువురు నేతలతో సమావేశమయ్యారు. అందులో మిమ్మల్ని పరిచయం చేసుకోండని అన్నారట. ఈ సమయంలో కోర్ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి అక్కడ జరిగిందట. స్వయానా ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వద్దకు వచ్చేసరికి ప్రధాని ఆప్ కా నామ్ క్యా హై అని ప్రశ్నించారట. దీంతో అక్కడున్న పార్టీ నేతలంతా అవాక్కయ్యారట.
సోము వీర్రాజు కంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లు పెద్దగా హడావుడి చేసేవారు కాదు. కానీ వీర్రాజు మాత్రం టీడీపీకి బీజేపీతో సత్ససంబంధాలు బాగా ఉన్న సమయంలోనే చంద్రబాబుపై, వారిపై ఒంటి కాలిపై లేచే వారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నది. అయినా ఆయన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అని ప్రచారం చేస్తుంటారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. ఏపీలో ఆ పార్టీ బలం అంతంత మాత్రం అయినా వీర్రాజు లాంటి వాళ్లు మోడీ గురించి, బీజేపీ గురించి గొప్పలు చెబుతారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరే ప్రధానికి గుర్తు లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
దీన్ని ఇక్కడ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లకు అంత సీన్ లేదు ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులుగా ఉన్న స్వాముల మాటలను ఉటంకిస్తున్నారు. అప్పుడెప్పుడో ఉండవల్లి చెప్పినా.. ఈ మధ్య కాలంలో స్వాములు చెప్పినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ప్రధాని గురించి, తమ పార్టీ గురించి ఎంత గొంతు చించుకున్నా వారి పతారా ఎంత అన్నది మరోసారి తేట తెల్లమైందని సెటైర్ వేస్తున్నారు.