Nandamuri Ramakrishna |
విధాత: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్10లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామకృష్ణకు స్వల్ప గాయాలవగా.. కారు ధ్వంసమైంది.
ఆ తర్వాత ఆయనను ఆసుప్రతికి తరలించి చికిత్స అందించగా.. ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబీకులు తెలిపారు. అయితే, రామకృష్ణ వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంతకుముందు గతంలో హరికృష్ణ, నందమూరి జానకీరామ్ సైతం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు సైతం కారు ప్రమాదం జరిగింది. ఇటీవల నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకతర్న సైతం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో నందమూరి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.