Shruti Haasan: శృతిహ‌స‌న్ హాలీవుడ్ ఎంట్రీ.. ముద్దులు, ఇంటిమేట్ సీన్ల‌తో రెచ్చి పోయిందిగా

  • By: sr    latest    Feb 26, 2025 8:43 PM IST
Shruti Haasan: శృతిహ‌స‌న్ హాలీవుడ్ ఎంట్రీ.. ముద్దులు, ఇంటిమేట్ సీన్ల‌తో రెచ్చి పోయిందిగా

విధాత‌: క‌మ‌ల్‌హాస‌న్ గారాల ప‌ట్టి శృతిహ‌స‌న్ (Shruti Haasan) మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. చివ‌ర‌గా స‌లార్ సినిమాలో క‌థానాయిక‌గా నాని హాయ్ నాన్నలో ఓ ప్ర‌త్యేక‌ పాట‌లో క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ ఫ‌స్ట్ టైం ఓ హాలీవుడ్ చిత్రం ది ఐ (The Eye)లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ విడుద‌ల చేశారు. అంతేకాదు ఫిబ్ర‌వ‌రి 27 నుంచి ముంబ‌య్ వేదిక‌గా నిర్వ‌హిస్తోన్న వెంచ్ ఫిలిం ఫెస్టివ‌ల్ (WENCH Film Festival) లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌ చూస్తే సినిమా మొత్తం శృతిహ‌స‌న్ (Shruti Haasan) చుట్టూనే తిరుగుతుంద‌ని తెలుస్తుండ‌గా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా సైక‌లాజిక‌ల్ థ్రిల్లింగ్ ఇచ్చే అంశాల‌తో రూపొందించిన‌ట్లు అర్ధ‌మ‌వుతుంది.

మాములుగా హాలీవుడ్ అంటేనే కిస్‌లు, ఘాటు స‌న్నివేశాల‌కు ప్ర‌సిద్ధి. ఈ సినిమాలోనూ ఇంటిమేట్ సీన్లు, ముద్దు స‌న్నివేశాలు బాగానే ఉన్న‌ట్లు తెలుస్తుండ‌గా శృతిహాస‌న్ ఎక్కడా జంకు లేకుండా చేసిన‌ట్లు టీజ‌ర్ చూస్తేనే తెలుస్తుంది. మ‌ర్క్ రౌలీ (Mark Rowley.) కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని డాఫ్నే ష్మోన్ (Daphne Schmon) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ వేస‌విలో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి.