‘అదానీ’ గ్రూప్ మాయాజాలం.. దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని కుంభకోణం
దేశ రాజకీయ, మీడియా రంగాలను గుప్పిట్లో పెట్టుకున్న గౌతమ్ అదానీ విదేశాల్లో మనీ లాండరింగ్, షేల్ కంపెనీలతో కోట్లకు పడగలు అయినా కన్నెత్తి చూడని ఈడీ, ఐబీ, సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలు అదానీ సంస్థల అప్పు రూ.2.31 లక్షల కోట్లపైనే హిండెన్ బర్గ్ రిపోర్టుతో కదులుతున్న అక్రమ సామ్రాజ్యం పునాదులు స్టాక్ మార్కెట్లలో వారం రోజుల్లో రూ.8 లక్షల కోట్లపైనే కరిగిపోయిన మదుపరుల సంపద విధాత: అదానీ గ్రూప్.. దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఓ భారీ […]

- దేశ రాజకీయ, మీడియా రంగాలను గుప్పిట్లో పెట్టుకున్న గౌతమ్ అదానీ
- విదేశాల్లో మనీ లాండరింగ్, షేల్ కంపెనీలతో కోట్లకు పడగలు
- అయినా కన్నెత్తి చూడని ఈడీ, ఐబీ, సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలు
- అదానీ సంస్థల అప్పు రూ.2.31 లక్షల కోట్లపైనే
- హిండెన్ బర్గ్ రిపోర్టుతో కదులుతున్న అక్రమ సామ్రాజ్యం పునాదులు
- స్టాక్ మార్కెట్లలో వారం రోజుల్లో రూ.8 లక్షల కోట్లపైనే కరిగిపోయిన మదుపరుల సంపద
విధాత: అదానీ గ్రూప్.. దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఓ భారీ కుంభకోణంగా కనిపిస్తున్నది. హిండెన్ బర్గ్ రిపోర్టుతో గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం పునాదులు కదిలిపోతున్నాయి మరి. ఢిల్లీ నుంచి గల్లీదాకా ప్రకంపనల్ని సృష్టిస్తున్న అదానీ గ్రూప్ వ్యవహారం వెనుక పెద్ద మాయాజాలమే ఉందని తెలుస్తున్నది.
అసలు ఎవరీ అదానీ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1962 జూన్ 24న ఓ స్థానిక జైన్ కుటుంబంలో గౌతమ్ అదానీ జన్మించారు. 8 మంది సంతానంలో ఒకరు. మొదట్నుంచీ అదానీ చదువు ఆగుతూ.. సాగుతూ నడిచింది. ఇలా బ్యాచిలర్ డిగ్రీ మధ్యలోనే విద్యకు గుడ్‌బై చెప్పేసిన అదానీ.. పూర్తి స్థాయిలో వ్యాపారంపై దృష్టి పెట్టారు.
అయితే తన తండ్రి వస్త్ర వ్యాపారాన్ని మాత్రం వారసత్వంగా తీసుకోలేదు. ఇక 16 ఏండ్ల వయసులోనే ముంబైకి చేరిన అదానీ.. వజ్రాల పరిశ్రమలో పనిచేశారు. ఈ క్రమంలోనే 1985లో చిన్నతరహా పరిశ్రమగా ఇంపోర్టింగ్ ప్రైమరీ పాలీమర్స్‌ను ప్రారంభించారు. 1988లో అదానీ ఎంటర్ ప్రైజెస్ మొదలైంది. అక్కడి నుంచి రకరకాల వ్యాపారాల్లోకి విస్తరిస్తూపోయారు.
మనీలాండరింగ్ అనుమానాలు
అదానీ గ్రూప్ విస్తరణ వెనుక 30 ఏండ్లుగా అనేక దేశాల్లో నడుస్తున్న మనీలాండరింగ్ కార్యకలాపాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతుండటం గమనార్హం. షెల్ కంపెనీలను సృష్టించి, తప్పుడు డాక్యుమెంట్లను తయారుచేసి గౌతమ్ అదానీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చారన్న వాదనలున్నాయి.
ఈ క్రమంలోనే తన ఎదుగుదలకు గుజరాత్ రాజకీయ వ్యవస్థను అదానీ తెలివిగా వాడుకున్నారు. నరేంద్ర మోదీ వర్గానికి దగ్గరై ఆర్థిక దన్నుగా నిలిచారు. చివరకు ప్రధానిగా నిలబెట్టి కేంద్ర ప్రభుత్వాన్నే తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇలా వచ్చిన ప్రాజెక్టులతోనే అపర కుబేరుడిగా అదానీ అవతరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోని దర్యాప్తు సంస్థలు
కేంద్ర ప్రభుత్వాన్నే తన గుప్పిట్లోకి తీసుకున్న అదానీ జోలికి దర్యాప్తు సంస్థలూ వెళ్లడం లేదు. నిజానికి అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతున్నదని రెండేండ్ల క్రితమే ఆరోపణలు వచ్చాయి. హర్షద్ మెహతా స్కాం వెలికితీత జర్నలిస్టుల్లో ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో స్టాక్ మార్కెట్లలో కొంత అలజడి రేగినా.. అదానీ జోరు మాత్రం తగ్గలేదు.
గత ఏడాది కూడా ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్.. అదానీ గ్రూప్ దివాలా తీస్తే దేశ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అయినా ఈడీ, సీబీఐ, ఐబీ వంటి ఏ సంస్థా కన్నెత్తి చూడలేదు. ఓ వైపు రాజకీయ అండదండలు.. మరోవైపు మీడియా బలం ఉండటమే దీనికి కారణం. అందుకే హిండెన్ బర్గ్ రిపోర్టు ఇంత సంచలనంగా మారింది.
తొమ్మిదో తరగతి విద్యార్థినికి కడుపునొప్పి.. ఆసుప్రతికి తీసుకెళ్లితే ఆడబిడ్డకు జన్మనిచ్చింది..!
ఏంటీ హిండెన్‌బర్గ్?
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనేది ఓ ష్టార్ట్ సెల్లింగ్ కార్యకలాపాల సంస్థ. న్యూయార్క్ కేంద్రంగా ఆరేండ్ల క్రితమే మొదలైంది. స్టాక్ మార్కెట్లలో అక్రమంగా షేర్ల విలువను పెంచుకునే సంస్థలను టార్గెట్ చేస్తుంది. వాటి షేర్ ధరలు పడిపోయేలా చేసి, ఆ తర్వాత కొంటుంది.
ఈ తరహా సంస్థలు మార్కెట్‌లో లిస్టింగ్ కంపెనీలకు ఓ పెద్ద సమస్యగా మారాయనే చెప్పుకోవచ్చు. పోంజీ స్కీంలను వెలుగులోకి తేవడంలో సిద్ధహస్తుడైన నాథన్ అండర్సన్ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు. మదుపరులను రక్షించడమే తమ లక్ష్యమని చెప్పే ఈ సంస్థ ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థల రహస్యాలను బట్టబయలు చేసి వాటి షేర్లను కుప్పకూల్చింది.
Viral Video | రోడ్లపై అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతున్న మహిళ
మోదీ సర్కారు వచ్చాకే..
2014కు ముందు అదానీ గ్రూప్.. దేశంలోని మిగతా వ్యాపార గ్రూపుల్లో ఒకటిగానే ఉన్నది. అయితే కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక.. దేశంలోనే అతిపెద్ద వ్యాపార గ్రూప్‌గా ఆవిర్భవించింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన ఏడు కంపెనీల షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. వీటికి అదనంగా ఇటీవల దక్కించుకున్న ఏసీసీ, అంబుజాలు కూడా ఉన్నాయి.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి దేశంలో, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ ఎదిగారు. కరోనా కాలంలో అందరి సంపద దిగజారినా.. అదానీది మాత్రం పెరుగుతూనే పొయింది. రోజుకు 1,600 కోట్లపైనే ఎగిసింది. ఆస్తులు వందలాది రెట్లు పెరిగాయి. గడిచిన మూడేండ్లలోనే 100 బిలియన్ డాలర్ల సంపద అదానీకి పెరిగింది. ఇదంతా గందరగోళంగా ఉండటంతోనే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ దృష్టి పెట్టింది.
ప్రముఖులు చనిపోతే చివరి చూపు చూడని నాగార్జున! భయమా..లేక సెంటిమెంటా?
హిండెన్‌బర్గ్ ఏం చెప్పింది?
అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ 85 శాతం కల్పితమేనని హిండెన్‌బర్గ్ తన నివేదికలో పేర్కొన్నది. వీటిని కొనవద్దని మదుపరులను హెచ్చరించింది. షేర్ల ధరలను పెంచడానికి అదానీ గ్రూప్ భారీ అవకతవకలకు పాల్పడిందని రుజువులతో సహా ఆరోపించింది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అప్పులు చేసిందన్నది. ప్రస్తుతం గ్రూప్ రుణ భారం రూ.2.31 లక్షల కోట్లపైనే ఉందని తెలిపింది. ఇక గ్రూప్ డైరెక్టర్లలోనూ అదానీ కుటుంబ సభ్యులే ఉన్నారన్నది. అంటే.. రౌండ్ ట్రిప్పింగ్, సర్క్యులర్ ట్రేడింగ్ వంటి అడ్డదారులను వాడుకుని కంపెనీ ఎదిగిందే తప్ప.. నిజంగా షేర్ల విలువలు పెరగటం కాదనేది అర్థమైపోతున్నది.