Medak: అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఆత్మహత్య

కొల్చారం మండలం అప్పాజీ పల్లిలో ఘటన విధాత, మెదక్ బ్యూరో: అప్పుల బాధతో వ్యవసాయ కూలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొల్చారం ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం… అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన రాజబోయిన షేకులు(58) మంగళవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా షేకులు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని ఆరోగ్య పరీక్షలు, […]

  • Publish Date - April 11, 2023 / 01:58 AM IST
  • కొల్చారం మండలం అప్పాజీ పల్లిలో ఘటన

విధాత, మెదక్ బ్యూరో: అప్పుల బాధతో వ్యవసాయ కూలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

కొల్చారం ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం… అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన రాజబోయిన షేకులు(58) మంగళవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా షేకులు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని ఆరోగ్య పరీక్షలు, వైద్య ఖర్చుల నిమిత్తం అప్పుల పాలైనట్లు తెలిపారు.

కూలి పని చేయడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పులు ఎక్కువ కావడం డబ్బుల కోసం కుటుంబంలో తరచూ గొడవలు కావడంతో మనస్థాపం చెందిన షేకులు మంగళవారం ఉదయం శివారులోని చెరువు సమీపంలో చింత చెట్టుకు తన దోతితో ఉరివేసుకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం పొలం పనులకు వెళుతున్న గ్రామానికి చెందిన కొంగోటి వీరేశం చూసి మృతుడి కుమారుడు గోపాల్‌కి తెలపడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసినట్లు తెలిపారు. మృతుని కుమారుడు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.