#Unstoppable: పవన్-బాలయ్య.. రికార్డులు బద్దలవుతున్నయ్

విధాత: పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. అభిమానులు ఏ స్థాయిలో దానిని రిసీవ్ చేసుకుంటారో.. తర్వాత దానిని ఎక్కడ పెడతారో తెలియంది కాదు. ఆయనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా వారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ నెంబర్ వన్‌లో ఉంచుతారు. ఇక పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఇటీవల ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ టుకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ […]

  • Publish Date - January 21, 2023 / 04:25 AM IST

విధాత: పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. అభిమానులు ఏ స్థాయిలో దానిని రిసీవ్ చేసుకుంటారో.. తర్వాత దానిని ఎక్కడ పెడతారో తెలియంది కాదు. ఆయనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా వారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ నెంబర్ వన్‌లో ఉంచుతారు.

ఇక పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఇటీవల ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ టుకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ చిన్నపాటి టీజర్‌ను తాజాగా మీడియాకు విడుదల చేశారు. ఈ టీజర్‌కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది.

పవన్‌కి సంబంధించిన టీజర్ అయినా, ట్రైలర్ అయినా, పొలిటికల్ ప్రసంగం అయినా.. ఆయన అభిమానులు ఓ పండగే. సినిమాల టీజర్స్. ట్రైలర్స్‌కి మాత్రమే కాదు.. ఇలాంటి టాక్‌ షోకి సంబంధించిన టీజర్‌ని కూడా వాళ్లు ఎవరెస్ట్ అంత ఎత్తులో పెట్టేశారంటే.. అది పవన్ కళ్యాణ్‌కి ఉన్న రేంజ్.