Air India | విమానంలో మ‌ల మూత్ర విస‌ర్జ‌న చేసిన ప్ర‌యాణికుడు.. అరెస్టు, విడుద‌ల‌

విధాత‌: విమానంలో మూత్రం పోసిన ఘ‌ట‌న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మ‌రోసారి చోటు చేసుకుంది. ముంబ‌యి నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఓ ప్ర‌యాణికుడు అంద‌రి ముందే మ‌ల మూత్ర విస‌ర్జ‌న, ఉమ్మి వేయ‌డం చేశాడు. ఈ మేర‌కు విమాన సిబ్బంది ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు పోలీసుల‌కు ఈ నెల‌ 24న ఫిర్యాదు చేశారు. కాగా.. నిందితుడ్ని పోలీసులు రాం సింగ్‌గా గుర్తించారు. విమానం గాల్లో ఉండ‌గా అత‌డు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో ఫ్లైట్ సిబ్బంది […]

  • Publish Date - June 27, 2023 / 06:34 AM IST

విధాత‌: విమానంలో మూత్రం పోసిన ఘ‌ట‌న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మ‌రోసారి చోటు చేసుకుంది. ముంబ‌యి నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఓ ప్ర‌యాణికుడు అంద‌రి ముందే మ‌ల మూత్ర విస‌ర్జ‌న, ఉమ్మి వేయ‌డం చేశాడు. ఈ మేర‌కు విమాన సిబ్బంది ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు పోలీసుల‌కు ఈ నెల‌ 24న ఫిర్యాదు చేశారు.

కాగా.. నిందితుడ్ని పోలీసులు రాం సింగ్‌గా గుర్తించారు. విమానం గాల్లో ఉండ‌గా అత‌డు అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో ఫ్లైట్ సిబ్బంది హెచ్చ‌రించారు. అయినా విన‌క‌పోవ‌డంతో అత‌డిని ప్ర‌యాణికుల నుంచి బ‌ల‌వంతా వేరు చేసి కూర్చోబెట్టారు.

దీంతో విమాన పైల‌ట్ దిల్లీ విమానాశ్ర‌య అధికారుల‌కు స‌మాచారాన్ని చేర‌వేశారు. పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్న ప్ర‌యాణికుడ్ని అదుపులో పెట్ట‌డానికి భ‌ద్ర‌తా సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని చెప్ప‌డంతో విమానాశ్ర‌య అధికారులు విమానం దిగ‌గానే రాంసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు నిందితుడ్ని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా ప్ర‌స్తుతం బెయిలుపై బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. నిందితుడు ఆఫ్రికాలో షెఫ్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎయిరిండియా విమానాల్లోనే గ‌త ఏడాది రెండు మూత్ర విస‌ర్జ‌న ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

Latest News