Alia Bhatt: స్టార్ కిడ్స్‌తో.. ఆలియా యాపారం బాగానే చేస్తుందిగా..
Alia Bhatt ఆలియా భట్.. ఈ పేరు బాలీవుడ్‌లో ఓ సంచలనం. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీతగా నటించి.. తెలుగు ప్రేక్షకులకు సైతం ఆలియా పరిచయమైంది. అన్నీ బాగుండి ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా ఆలియానే హీరోయిన్ అయి ఉండేది. సడెన్‌గా పెళ్లి, ఆ పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో.. కాస్త డిస్టర్బ్ అయిన ఆలియా.. ఎన్టీఆర్ 30 చిత్రానికి ముందుగానే నో చెప్పేసింది. దీంతో ఇప్పుడామె […]

Alia Bhatt
ఆలియా భట్.. ఈ పేరు బాలీవుడ్‌లో ఓ సంచలనం. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీతగా నటించి.. తెలుగు ప్రేక్షకులకు సైతం ఆలియా పరిచయమైంది. అన్నీ బాగుండి ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా ఆలియానే హీరోయిన్ అయి ఉండేది.
సడెన్‌గా పెళ్లి, ఆ పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో.. కాస్త డిస్టర్బ్ అయిన ఆలియా.. ఎన్టీఆర్ 30 చిత్రానికి ముందుగానే నో చెప్పేసింది. దీంతో ఇప్పుడామె ప్లేస్‌లోకి జాన్వీ కపూర్ వచ్చి చేరింది. సరే విషయంలోకి వస్తే..
ఆలియా భట్ చేస్తున్న పని చూస్తుంటే.. ఈ బుడ్డది మహా ఘటికురాలే అనిపిస్తుంది. పొట్టివాళ్లకి పుట్టెడు బుద్ధులు అంటుంటారు కదా.. అది ఖచ్చితంగా ఆలియాకి వర్తిస్తుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనేలా.. ఆమెలోని కమర్షియల్ యాంగిల్ బయటికి వస్తోంది.
ఆలియా(Alia Bhatt) నటిగా నటిస్తూనే.. బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఆమెకి ఆన్‌లైన్ గార్మెంట్స్ బిజినెస్ ఉంది. ఈద్-ఏ-మమ్మ (Ed-a-Mamma) పేరుతో ఎక్స్‌క్లూజివ్ కిడ్స్ వేర్‌ని ఆలియా నడుపుతోంది. అయితే అటు బిజినెస్ పెరిగేలా.. అలాగే తనకి నేమ్ వచ్చేలా ఆలియా సూపర్బ్‌గా ఈ బిజినెస్ చేస్తోంది. అదెలా అనుకుంటున్నారా?.
View this post on Instagram
ఈ యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఆలియా ఎన్నుకున్న మార్గం స్టార్ కిడ్స్. ‘RRR’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పిల్లలకు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలకు ఆలియా స్పెషల్‌గా డ్రస్సులు పంపి.. అటెన్షన్‌ని గేదర్ చేస్తోంది. రామ్ చరణ్‌కి ఇంకా పిల్లలు పుట్టలేదు అనే డౌట్ రావచ్చు. కానీ పుట్టబోయే బిడ్డకి కూడా కొన్ని డ్రస్సులను ఆలియా(Alia Bhatt) గిఫ్ట్‌గా పంపింది. ఆ విషయం ఉపాసన తన ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది.
అలాగే ఎన్టీఆర్ కూడా తన కుమారులిద్దరికీ ఆలియా పంపిన డ్రస్సులు వేసి ఫొటోలు పెట్టాడు. ఇక మహేష్ భార్య నమ్రత వంతు వచ్చింది. ఆమె కూడా తాజాగా ఇన్‌స్టాలో సితార ఫొటో పెట్టి.. ఆలియాకు థ్యాంక్స్ చెప్పింది.
సో.. ఇలా గిఫ్ట్స్ ఇచ్చినట్లుగా పేరుకు పేరు.. తద్వారా వ్యాపార అభివృద్ధి.. ఇంత కంటే తెలివిగా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. అందుకే అంది.. ఆలియా ఘటికురాలు అని. ప్రస్తుతం ఆమె బిజినెస్ అద్భుతంగా రన్ అవుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.