Allu Arjun | సంతోషంతో భార్య‌ని గ‌ట్టిగా ప‌ట్టుకొని ఏడ్చేసిన బ‌న్నీ.. ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపిన టాలీవుడ్

Allu Arjun | భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను గ‌త రాత్రి కేంద్ర ప్ర‌భుత్వం అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. 2021 సంవత్సరానికి గానూ బెస్ట్ మూవీస్.. ఉత్తమ నటీనటులతో పాటు పలు విభాగాల్లో అవార్డ్స్ విజేతలను ప్ర‌క‌టించ‌గా, ఈ సారి అల్లు అర్జున్ స‌రికొత్త సృష్టించాడు. ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకొని తెలుగోడి స‌త్తా చాటాడు. కొన్ని ద‌శాబ్దాలుగా టాలీవుడ్‌కి క‌ల‌గా మిగిలిన ఉత్త‌మ న‌టుడి నేష‌న‌ల్ […]

  • By: sn    latest    Aug 25, 2023 2:40 AM IST
Allu Arjun | సంతోషంతో భార్య‌ని గ‌ట్టిగా ప‌ట్టుకొని ఏడ్చేసిన బ‌న్నీ.. ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపిన టాలీవుడ్

Allu Arjun |

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను గ‌త రాత్రి కేంద్ర ప్ర‌భుత్వం అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. 2021 సంవత్సరానికి గానూ బెస్ట్ మూవీస్.. ఉత్తమ నటీనటులతో పాటు పలు విభాగాల్లో అవార్డ్స్ విజేతలను ప్ర‌క‌టించ‌గా, ఈ సారి అల్లు అర్జున్ స‌రికొత్త సృష్టించాడు. ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకొని తెలుగోడి స‌త్తా చాటాడు.

కొన్ని ద‌శాబ్దాలుగా టాలీవుడ్‌కి క‌ల‌గా మిగిలిన ఉత్త‌మ న‌టుడి నేష‌న‌ల్ అవార్డ్‌ని సాకారం చేశాడు బ‌న్నీ. దీంతో టాలీవుడ్‌తో పాటు బ‌న్నీ కుటుంబ స‌భ్యులు, అభిమానులు, ఆయ‌న స‌న్నిహితుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక బ‌న్నీ అయితే ఈ వార్త విని త‌న‌ను తాను న‌మ్మ‌లేక‌పోయాడు.

‘పుష్ప’ చిత్ర దర్శకుడు సుకుమార్ ని, అలానే త‌న భార్య స్నేహా రెడ్డిని గ‌ట్టి హగ్ చేసుకుని క‌న్నీరు పెట్టుకున్నాడు. మరోవైపు తండ్రి అల్లు అరవింద్‌ని ఆలింగనం చేసుకుని ఎమోషనల్ కాగా, త‌ల్లి నిర్మలని హగ్‌ చేసుకుని క‌న్నీరు పెట్టుకున్నారు.

మొదటిసారి తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడమనేది గర్వించే విషయం కాగా, బ‌న్నీ ఇంటికి సెల‌బ్రిటీలు క్యూ క‌ట్టి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక పుష్ప’టీమ్‌, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో బన్నీ తన సక్సెస్‌ సెలబ్రేషన్స్ జ‌రుపుకోగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి

ఇక అల్లు అర్జున్‌కి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల చిరంజీవి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డ్ సాధించిన విన్నర్స్ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ‌జేసిన చిరుంజీవి అందులో ప్రతీ ఒక్కరి పేరును ప్రస్తావించారు. ఇక మైడియర్ బన్నీ అంటూ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ సాధించిన అల్లు అర్జున్ ని ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే అల్లు అర్జున్ బావ అంటూ అల్లు అర్జున్ బావా అంటూ.. ఇంత గొప్ప ఘనతను సాధించిన నీకు ఇక తిరుగులేదంటూ.. త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ‌మౌళి, బాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు బన్నీతో పాటు జాతీయ
అవార్డ్ సాధించిన వారికి తమ విషెస్ తెలియ‌జేశారు.