" /> " /> " /> " />
విధాత: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీ మల్లోజుల వేణుగోపాల్‌రావుల తల్లి మధురమ్మ ఈ నెల 2వ తేదీన తుదిశ్వాస విడిచారు.
పీడిత ప్రజల పక్షాన పోరాడటానికి, దోపిడీ నుంచి విముక్తి కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా విప్లవ బాట పట్టారు. కన్నతల్లి కడసారి చూపునకు కూడా నోచుకోలేని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు వేణుగోపాల్ రావు బాధను భావోద్వేగంతో లేఖలో వెల్లడించారు.
“మీ అంత్యక్రియలకు రాలేనందుకు చింతిస్తున్నా..పెద్దపల్లి పెద్దవ్వలేదని మావోయిస్టు పార్టీ ఏడుస్తున్నది. నీ మరణం నాకే కాదు యావత్ మావోయిస్ట్ కుటుంబ సభ్యులకి తీరని లోటు.
మల్లోజుల కోటేశ్వర రావు, వేణుగోపాల్ రావు లాంటి సామాన్య వ్యక్తులు మావోయిస్ట్ పార్టీకోసం కన్నావ్” అని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.