Ankitha | నవదీప్‌తో గొడవ లేదు.. బాలయ్యతో చేసిన సినిమా హిట్ అయితే ఉండేదాన్ని!

Ankitha | హిట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుని, మంచి సినిమాలు చేసి తెరమరుగైన తారలెందరో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు నటించిన సినిమాలు వారిని మరిచిపోనీయవ్. అభిమానుల్లో వాళ్ళు చేసిన పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. అలా తెలుగు సినిమాల్లో చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తుండిపోయే సినిమాలను చేసిన తార అంకిత. హీరోయిన్స్ పెళ్లితో సెటిల్ అయ్యాకా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సినిమాలలోకి రావడం మామూలే.. ఇప్పుడు అదే రూట్‌లో ఉన్నానంటోంది […]

  • By: krs    latest    Jul 21, 2023 1:37 AM IST
Ankitha | నవదీప్‌తో గొడవ లేదు.. బాలయ్యతో చేసిన సినిమా హిట్ అయితే ఉండేదాన్ని!

Ankitha |

హిట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుని, మంచి సినిమాలు చేసి తెరమరుగైన తారలెందరో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు నటించిన సినిమాలు వారిని మరిచిపోనీయవ్. అభిమానుల్లో వాళ్ళు చేసిన పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. అలా తెలుగు సినిమాల్లో చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తుండిపోయే సినిమాలను చేసిన తార అంకిత. హీరోయిన్స్ పెళ్లితో సెటిల్ అయ్యాకా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సినిమాలలోకి రావడం మామూలే.. ఇప్పుడు అదే రూట్‌లో ఉన్నానంటోంది అంకిత.

90ల్లో రస్నా యాడ్‌ ద్వారా బాల నటిగా గుర్తింపు పొందిన ఈ ముద్దగుమ్మ వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరీలో చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అదే ఎడాది మూడు చిత్రాలు చేసింది. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహాద్రి’‌లో చేసిన అంకిత ‘చీమ చీమ చీమా’ అంటూ చేసిన పాట ఇప్పటికీ సూపర్ గ్రేస్‌లో ఉంటుంది. మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయే పాట ఇది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం పెళ్ళి చేసుకుని భర్తతో ఇద్దరు పిల్లలతో లైఫ్‌ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తుంది.

హీరోయిన్‌గా అంకిత చేసిన సినిమాలు మంచి హిట్స్ అయినా తగిన స్థాయిలో గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. అయితే తనకి ఇంకా నటించాలని ఉందని, ఇప్పుడు అవకాశం ఇచ్చినా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తానని తెగ ఉత్సాహంగా ఈమధ్య ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంకిత.

ఇక మంచి ఫామ్‌లో ఉండగా హీరో నవదీప్‌కి అంకితకి మధ్య ఏవో గొడవలున్నాయనే మాట కూడా గట్టిగానే వినిపించేది. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చింది అంకిత. నవదీప్ తనకి మధ్య ఎలాంటి గొడవ జరగ లేదని.. ‘మనసు మాట వినదు’ మూవీ సమయంలోనే మరో మూవీ చేయాల్సి రావడంతో ఒత్తిడికి లోనై నవదీప్ మీద కాస్త ప్రస్టేట్ అయ్యేదాన్నని.. అంతేకాని.. మా మధ్యలో ఎలాంటి క్లాష్ రాలేదని చెప్పుకొచ్చింది.

నటన మీద ఎంతో ఇష్టంతో వచ్చిన తనకి కొన్ని హిట్స్ పడినా, చివర్లో బాలకృష్ణతో చేసిన ‘విజయేంద్ర వర్మ’ మూవీ డిజాస్టర్ అయ్యి చాలా నిరాశ పరిచిందని తెలిపింది అంకిత. ఆ సినిమా గానీ హిట్ అయ్యి ఉంటే తను సినిమాల్లో కంటిన్యూ అయ్యేదాన్నని.. కాకపోవడంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసి, పెళ్ళి చేసుకున్నానని వెల్లడించింది.

ఇప్పుడు లైఫ్ బాగానే నడుస్తున్నా, ఇంకా నటించాలనే కోరిక పోలేదని, త్వరలోనే మంచి ఛాన్స్ వస్తే మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటుందీ అమ్మడు. చూద్దాం కాస్త బొద్దుగా కనిపిస్తున్న అంకితకి ఎలాంటి పాత్ర దక్కుతుందో మరి.