ముగిసిన యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా కొనసాగి గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంలతో ఘనంగా ముగిశాయి.

- ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకం..శృంగార డోలోత్సవం
విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా కొనసాగి గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంలతో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామివారి గర్భాలయంలో మూలవరులకు నిత్యారాధనలు అభిషేకాల అనంతరం అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించారు.
108 కలశాల పూజలతో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం అర్చకులు, యజ్ఞికులు, పారాయణికుల బృందం అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామి అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలను పరిసమాప్తం చేశారు.
అనంతరం దేవస్థానం తరపున అర్చక, యజ్ఞిక, పారాయణికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహ చార్యులు, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కర్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.