Tirumala | తిరుమలలో.. చిక్కిన ఐదో చిరుత

Tirumala | విధాత: తిరుమల శ్రీవారి క్షేత్రానికి వెళ్లే అలిపిరి-తిరుమల నడక మార్గంలో తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. రెండు నెలలుగా ఈ మార్గంలో చిరుతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏకంగా చిన్నారి ప్రాణం తీసిన చిరుతలు.. టీటీడీ, అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు తిరుమల కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. నడకమార్గం గుండా అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు […]

  • Publish Date - September 7, 2023 / 10:03 AM IST

Tirumala |

విధాత: తిరుమల శ్రీవారి క్షేత్రానికి వెళ్లే అలిపిరి-తిరుమల నడక మార్గంలో తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. రెండు నెలలుగా ఈ మార్గంలో చిరుతలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏకంగా చిన్నారి ప్రాణం తీసిన చిరుతలు.. టీటీడీ, అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ఈ క్రమంలో అధికారులు తిరుమల కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. నడకమార్గం గుండా అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఇదివరకే నాలుగు చిరుతలు పట్టుబడగా, అధికారులు, భక్తులు ఊపిరి తీసుకున్నారు.

అంతలోనే నాలుగు రోజుల క్రితం ట్రాప్ కెమెరాలో చిరుత ఆనవాళ్లను గుర్తించిన అధికారులు, బంధించేం దుకు రంగంలోకి దిగారు. నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు, కొత్త మండపం వద్ద బోన్లు ఏర్పాటు చేసి, చిరుతకు ఎరలు అందించగా చిక్కుకుంది. దీంతో ఇప్పటివరకు నడక మార్గం అటవీ ప్రాంతంలో ఐదు చిరుతలు పట్టుబడ్డాయి.