Nalgonda: చేపల వేటకు వెళ్లి మ‌రొకరు మృతి.. మార్చి 13న గంట శ్రీ‌ను.. నేడు సోము శ్రీ‌ను

మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని కోరుతున్న గ్రామ‌స్తులు విధాత: నల్గొండ జిల్లా కనగల్ మండలం జి. ఎడవెల్లి గ్రామానికి చెందిన సోము శ్రీను( 51 ) మంగళవారం సాయంత్రం చండూరు మండలంలోని ఉడతల పల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. శ్రీను మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చండూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం […]

Nalgonda: చేపల వేటకు వెళ్లి మ‌రొకరు మృతి.. మార్చి 13న గంట శ్రీ‌ను.. నేడు సోము శ్రీ‌ను
  • మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని కోరుతున్న గ్రామ‌స్తులు

విధాత: నల్గొండ జిల్లా కనగల్ మండలం జి. ఎడవెల్లి గ్రామానికి చెందిన సోము శ్రీను( 51 ) మంగళవారం సాయంత్రం చండూరు మండలంలోని ఉడతల పల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. శ్రీను మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

చండూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే నెల మార్చి 13వ తేదీన ఇదే జి.ఎడవెల్లి గ్రామానికి చెందిన గంట శ్రీను సైతం చేపల వేటలో మృతి చెందాడు. ఆయన అకాల మరణంతో భార్య, ముగ్గురు కూతురులు కుటుంబ ప్రధాన పోషకుడిని కోల్పోయారు. ఆ దుర్ఘటన మరువక ముందే ఇదే గ్రామానికి చెందిన మరొకరు చేపల వేటలో మృత్యువాత పడడం.. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడం విషాదకరం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.