బీజింగ్‌లో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు

విధాత: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా రాజధాని బీజింగ్‌లో ఆందోళనలు ఊపందుకున్నాయి. కొవిడ్‌ కట్టడికి చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోన్న జీరో కోవిడ్ విధానానికి స్వస్తి చెప్పాలంటూ చైనీయులు డిమాండ్ చేస్తున్నారు. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు నిరసనకారుల్ని అడ్డుకునేందుకు డ్రాగెన్ ప్రభుత్వం బలగాలను మోహరిస్తున్న‌ది. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా చైనా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీరో కోవిడ్ విధానంపై అక్క‌డి ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు వ్య‌తిరేకంగా బీజింగ్‌లో అత్యంత […]

  • By: krs    latest    Oct 14, 2022 12:21 PM IST
బీజింగ్‌లో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు

విధాత: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా రాజధాని బీజింగ్‌లో ఆందోళనలు ఊపందుకున్నాయి. కొవిడ్‌ కట్టడికి చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోన్న జీరో కోవిడ్ విధానానికి స్వస్తి చెప్పాలంటూ చైనీయులు డిమాండ్ చేస్తున్నారు. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు నిరసనకారుల్ని అడ్డుకునేందుకు డ్రాగెన్ ప్రభుత్వం బలగాలను మోహరిస్తున్న‌ది.

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా చైనా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీరో కోవిడ్ విధానంపై అక్క‌డి ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌కు వ్య‌తిరేకంగా బీజింగ్‌లో అత్యంత ర‌ద్దీగా ఉండే ఫ్లెక్సీలు వెలిశాయి. క‌మ్యూనిస్టులు పార్టీ 20 స‌ర్వ‌స‌భ్య స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న ఫ్లెక్సీలు ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో డ్రాగ‌న్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. అధ్య‌క్షుడికి ఇబ్బందిగా మారిన ఫ్లెక్సీల‌ను వెంట‌నే తొలిగించింది.

ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా బీజింగ్‌లో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసింది. 2019లో కొవిడ్ వెలుగు చూసిన‌ప్ప‌టి నుంచి చైనా పాల‌కులు అత్యంత క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌తో లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. ప్ర‌పంచ‌మంతా ఆంక్ష‌లు తొలిగించి సాధార‌ణ జీవ‌నాన్ని అనుమ‌తిచ్చినా చైనా జీరో కొవిడ్ పేరుతో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్న‌ది. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చైనా ప్ర‌జ‌లు త‌మ‌కు పూర్తి స్వేచ్ఛ కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు.