Kejriwal | BJP ఆదేశిస్తే CBI నన్ను అరెస్ట్ చేస్తుంది: కేజ్రీవాల్

నేను రూ.1000 కోట్లు మోడీకి ఇచ్చానని చెపుతున్నా.. అరెస్ట్‌ చేస్తారా? ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ సమన్లపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రియాక్షన్‌ విధాత: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ ఇచ్చిన నోటీస్‌లపై స్పంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తాను నోటీస్‌లో వాళ్లు ఇచ్చిన సమాయానికి ఆదివారం సిబిఐ విచారణకు వెళ్తానని తెలిపారు. తనను అరెస్ట్‌ చేయాలని అరెస్టు చేయాలని బీజేపీ వాళ్లు ఆదేశిస్తే సీబీఐ వాళ్లు చేయక ఏం చేస్తారు? […]

  • Publish Date - April 15, 2023 / 01:04 PM IST
  • నేను రూ.1000 కోట్లు మోడీకి ఇచ్చానని చెపుతున్నా.. అరెస్ట్‌ చేస్తారా?
  • ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ సమన్లపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రియాక్షన్‌

విధాత: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ ఇచ్చిన నోటీస్‌లపై స్పంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తాను నోటీస్‌లో వాళ్లు ఇచ్చిన సమాయానికి ఆదివారం సిబిఐ విచారణకు వెళ్తానని తెలిపారు. తనను అరెస్ట్‌ చేయాలని అరెస్టు చేయాలని బీజేపీ వాళ్లు ఆదేశిస్తే సీబీఐ వాళ్లు చేయక ఏం చేస్తారు? అని అన్నారు.

బీజేపీ ఆదేశాల మేరకు కోర్టు ముందు సీబీఐ, ఈబీ అబద్ధాలు చెపుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ను కేసులో ఇరికించెందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. చందన్ రెడ్డిని దర్యాప్తు అధికారులు కొట్టారని ఆరోపించారు.

అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రలను భయపెట్టి వాంగ్మూలం ఇప్పించారన్నారు. ఆ తర్వాత వారిద్దరూ తమ వాంగ్మూలం విత్ డ్రా చేసుకున్నారని కేజ్రీవాల్ తెలిపారు. వంద కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేశారని, కానీ, మనీష్ సిసోడియా వద్ద ఏమి దొరకలేదని తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల లో అవినీతి డబ్బు ఖర్చు పెట్టామని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని కేజ్రీవాల్‌ అన్నారు. తాము అంతా చెక్ ల ద్వారానే విరాళాలు తీసుకున్నాని తెలిపారు.

ఈ మేరకు గోవా ఎన్నికల ఖర్చుల వివరాలు ఈసికి ఇచ్చామన్నారు. తాను రూ. 1000కోట్లు ప్రధాన మంత్రి మోడీకి ఇచ్చాననీ చెపుతున్నాను… మీరు ఆయన్ను అరెస్ట్ చేస్తారా? అని సీబీఐ, ఈడీ అధికారును ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం పాలసీ చాలా అద్భుతమైన విధానమని, దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు.