Asifabad | ధరణి రద్దు చేస్తే.. దళారి రాజ్యమే: సీఎం కేసీఆర్

Asifabad ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సీఎం వరాలు సీఎం ప్రత్యేక నిధి నుండి గ్రామ పంచాయతీకి రూ.పది లక్షలు.. మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంత‌రం ఆదివాసి గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేశారు. త‌ద‌నంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా […]

  • Publish Date - June 30, 2023 / 12:53 PM IST

Asifabad

  • ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సీఎం వరాలు
  • సీఎం ప్రత్యేక నిధి నుండి గ్రామ పంచాయతీకి రూ.పది లక్షలు..
  • మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంత‌రం ఆదివాసి గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేశారు. త‌ద‌నంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిని తీసుకొచ్చి రైతుల ఇబ్బందులను తీర్చితే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని పేర్కొంటుంద‌న్నారు. ధరణి రద్దు అయితే దళారుల రాజ్యం వస్తుందని పైరవీ కారులు వచ్చి లంచాల రూపంలో డబ్బులు దండుకుంటారని పేర్కొన్నారు.

ధరణి పనితీరుపై ప్రజలను బహిరంగ సభలో అడిగి తెలుసుకున్నారు. ఎంత మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని దేశంలో గ్రామ పంచాయతీల‌కు అవార్డులు ప్రకటిస్తే 10లో 9 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. అవార్డుల రాక‌తో తెలంగాణ ఘనత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.

అసిఫాబాద్ పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో రైతులందరూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ అమలు చేయాల‌ని ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. స్కీములు అమలు చేయకపోతే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని అడుగుతున్నారని తెలిపారు.

అసిఫాబాద్ జిల్లాలో రోడ్లు కూడా అభివృద్ధి చెందాయని, ఇక్కడినుండే ఫోర్ లైన్స్ రోడ్డు వెళుతుందని అన్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన త్రాగునీరు లేక వర్షాకాలంలో ఆదివాసి గిరిజన ప్రాంతాలలో అంటు రోగాలు వచ్చేవని ఇప్పుడు పరిస్థితి లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.

మారుమూల గిరిజన ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తున్నామని అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు త్రి పేజ్ కరెంటు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలలో కూడా ఊహించని అభివృద్ధిని మీరు చూస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడేవారని ఇప్పుడు ఆసిఫాబాద్ ప్రాంతాన్ని జిల్లా చేయడం మూలంగా ప్రయాణ భారం తగ్గిందని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి అవకాశం లేదని వారి పాలనలో హరిగోస పడ్డామని 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అసిఫాబాద్ జిల్లాలో ఉన్న 335 గ్రామపంచాయతీలకు 10 లక్షల చొప్పున రెండు మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి నిధులు మంజూరు చేస్తారని
అలాగే మంచిర్యాల జిల్లాలో సైతం 7 మున్సిపాలిటీలకు ఒక్కొక్క మున్సిపాలిటీ 25 కోట్లు, 311 గ్రామపంచాయతీలకు ఒక్కో గ్రామపంచాయతీకి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మర్చిపోరని రాబోయే ఎన్నికల్లో వందశాతం టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోనప్ప కోరినట్లు కౌటాల నుండి వర్ధ నది మీద వంతెన నిర్మాణానికి 75 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతానికి ఓ ఐటిఐ కళాశాలను మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న నాగమ్మ చెరువులో బుద్ధుని విగ్రహం కోసం ఎస్టిమేట్ వేయించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఆదివాసి, దళిత, బిసి ముస్లిం మైనారిటీ ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో హోంశాఖ మంత్రి, మహమ్మద్ అలీ , రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, అసిఫాబాద్ జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు , ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest News