వైఫ్ స్వాప్‌కు భార్య అంగీకరించలేదని.. అసహజ శృంగారం కోసం వేధింపులు
విధాత: వైఫ్ స్వాప్(భార్యలను మార్చుకోవడం) గేమ్‌కు అంగీకరించలేదని ఓ భర్త తన భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. అసహజ శృంగారం చేయాలంటూ తరుచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో భర్త ఆగడాలు, వేధింపులు భరించలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అమర్ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రెండు, మూడు రోజుల క్రితం తన భార్యను హోటల్‌కు తీసుకువచ్చి ఓ గదిలో బంధించాడు. వైఫ్ […]

విధాత: వైఫ్ స్వాప్(భార్యలను మార్చుకోవడం) గేమ్‌కు అంగీకరించలేదని ఓ భర్త తన భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. అసహజ శృంగారం చేయాలంటూ తరుచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో భర్త ఆగడాలు, వేధింపులు భరించలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అమర్ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రెండు, మూడు రోజుల క్రితం తన భార్యను హోటల్‌కు తీసుకువచ్చి ఓ గదిలో బంధించాడు. వైఫ్ స్వాప్(భార్యలను మార్చుకోవడం) గేమ్‌లో భాగస్వామ్యం కావాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమె ఫోన్‌ను దొంగిలించి పారిపోయాడు.
ఇక మద్యం మత్తులో తూలుతూ హోటల్‌కు తిరిగి వచ్చాడు. మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె అమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధిత భార్య మాట్లాడుతూ.. తన భర్తకు డ్రగ్స్ అలవాటు ఉందన్నారు. అమ్మాయిలతో, అబ్బాయిలతో శారరీక సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
తనను వైఫ్ స్వాప్‌లో భాగస్వామ్యం కావాలన్నాడని, తాను అంగీకరించక పోయేసరికి, అసహజ శృంగారం చేసేందుకు బలవంతం చేశాడని బాధితురాలు వాపోయింది. ఇక అత్తమామలతో పాటు ఆడపడుచు కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. రూ. 50 లక్షలు తేవాలని గత కొద్ది రోజుల నుంచి తనను డిమాండ్ చేస్తున్నారని బాధితురాలు తెలిపింది.