Astrology Weekly Horoscope | వార ఫలాలు (చంద్రచారము ఆధారంగా) 18.06.2023 నుంచి 24.06.2023 వరకు మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికలు రూపొందించే సమయంలో, నిర్వహణలో జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉంటే మంచిది. వృత్తిపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త వహించాలి. భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం […]
Astrology Weekly Horoscope | వార ఫలాలు (చంద్రచారము ఆధారంగా) 18.06.2023 నుంచి 24.06.2023 వరకు
మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. రావాల్సిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికలు రూపొందించే సమయంలో, నిర్వహణలో జాగ్రత్త వహించాలి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉంటే మంచిది. వృత్తిపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త వహించాలి.
భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించిండి.ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
వృషభరాశి: (కృత్తిక 2, 3, 4; రోహిణి; మృగశిర 1, 2)
ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన బకాయిలు అందడంలో జాప్యం జరుగుతుంది. నియంత్రణలేని ఖర్చును అదుపు చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికలు, నిర్వహణలో జాగరూకత అవసరం. స్పెక్యులేషన్ చేయకండి. వృత్తిపరంగా స్వల్ప ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. వాదములలో జాగ్రత్త వహించాలి.
రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాలు ఓ మోస్తరుగా ఉంటాయి. స్థిరాస్థులు జోడించేందుకు ప్రయత్నించ వచ్చు. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. పొరపొచ్చాలు పరిష్కారమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
మిథునరాశి: మృగశిర 3, 4; ఆరుద్ర; పునర్వసు 1, 2, 3)
ఆర్థిక విషయాలు సవ్యంగా సాగిపోతాయి. ఎంపిక చేసిన విషయాల్లో ఊహాత్మక నిర్ణయాలు, ప్రణాళిక ఓ మోస్తరుగా ఫలిస్తాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత మేరకు ఉపశమనం దొరుకుతుంది. వృత్తిపరమైన కార్యకలాపాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్తగా ఉండాలి.
భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. ఇంట్లో సుఖశాంతులు నెలకొని ఉంటాయి. భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. మనసు స్థిరంగా ఉండి, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కొంత ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి: (పునర్వసు 4; పుష్యమి; ఆశ్లేష)
ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన బకాయిలు అందడంలో జాప్యం జరుగుతుంది. నియంత్రణలేని ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండాలి. వృత్తిపరంగా చిన్నపాటి సమస్యలు ఎదురుకావచ్చు. వాదములలో జాగ్రత్త వహించాలి. భూమి లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి.
ఇంట్లో సుఖశాంతులు వర్థిల్లుతాయి. అభిప్రాయ బేధాలు తొలగిపోతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉన్నది. 24.06.2023, బుధుడు 12వ ఇంటకు మారుతున్నందున ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంట్లో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం, ఔషధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి (మాఘ, పూర్వ, ఫాల్గుణి, ఉత్తర 1)
ఆర్థిక విషయాలు సవ్యంగా సాగిపోతాయి. ఎంపిక చేసిన విషయాల్లో స్పెక్యులేషన్, ప్రణాళికలు మోస్తరు ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి పరమైన కార్యకలాపాల్లో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం.
భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. కొనుగోళ్లను వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంట్లో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం తీసుకునే విషయంలో శద్ధ తీసుకోవాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ వద్దు.
కన్యా రాశి: (ఉత్తర 2, 3, 4; హస్త; చిత్త 1, 2)
ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు జాప్యం అవుతాయి. నియంత్రణలేని ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ప్రణాళికలు, నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ చేయకండి. వృత్తిపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో మోస్తరు ప్రగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించే అవకాశం ఉన్నది.
ఇంట్లో సుఖశాంతులు వర్థిల్లుతాయి. అభిప్రాయ బేధాలు తొలగిపోతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి కొంత ఉపశమనం ఉంటుంది. 24.06.2023 నుంచి బుధుడు 10వ ఇంటకు మారుతున్నందున పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. ఆర్థిక విషయాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. కొంత ఉపశమనం లభిస్తుంది.
తులా రాశి: (చిత్త 3, 4; స్వాతి; విశాఖ 1, 2, 3)
ఆర్థిక విషయాలు సవ్యంగా సాగిపోతాయి. స్పెక్యులేషన్, ప్లానింగ్ మోస్తరు విజయాన్ని ఇస్తాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరమైన కార్యకలాపాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వాదములలో అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో మోస్తరు ప్రగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించే అవకాశం ఉన్నది. మనసు అంశాంతితో నిండి ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇంట్లో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగస్థులు ఆహారం తీసుకోవడంలో శ్రద్ధ వహించాలి. ఔషధాల విషయంలో అశ్రద్ధ తగదు. 24.06.2023 నుంచి బుధుడు 9వ ఇంటకు మారుతున్నందున కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. ఆదాయానికి సంబంధించిన అంశాల్లో కొంత ప్రతికూలత ఎదురుకావచ్చు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో మందగమనం ఉంటుంది.
వృశ్చిక రాశి: (విశాఖ 4; అనూరాధ; జ్యేష్ఠ)
భారీ ఖర్చులు ఉంటాయి. డబ్బు వృథా అవుతుంది. స్పెక్యులేషన్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవ్వాల్సిన బాకీలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. సాధారణ అప్పులు కూడా లభించే పరిస్థితి ఉండదు. వృత్తిపరమైన కార్యకలాపాల్లో సమస్యలు రావచ్చు. వాదములకు దూరంగా ఉండండి. భూమి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ నిర్మాణ కార్యకలాపాలు స్తంభిస్తాయి. కొనుగోళ్లు వాయిదా వేయండి.
మనసు స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంట్లో ఘర్షణవాతావరణాన్ని నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగస్థులు ఆహారం విషయంలో జాగ్రత్త పాటించాలి, ఔషధాల విషయంలో అశ్రద్ధ తగదు. 24.06.2023 నుంచి బుధుడు 8వ ఇంటకు మారుతున్నందున పరిస్థితి కొంత మారుతుంది. ఆరోగ్యం మెరుగువుతుంది. దీర్ఘకాలిక వ్యాధిగస్థులకు కొంత ఉపశమనం లభిస్తుంది.
ధనూ రాశి : (మూలా; పూర్వాషాఢ; ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడులు ఉంటాయి. స్పెక్యులేషన్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా రాణిస్తారు. హోదా, స్థాయిలలో ఉన్నవారికి మెరుగుదల ఉంటుంది.
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో మోస్తరు ప్రగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించే అవకాశం ఉన్నది. ఇంటిలో సుఖశాంతులు నెలకొంటాయి. అడ్డంకులు, అభిప్రాయబేధాలు పరిష్కారమవుతాయి. మనసు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఉపశమనం పొందుతారు.
మకర రాశి: (ఉత్తరాషఢ 2, 3, 4; శ్రవణ; ధనిష్ఠ 1, 2)
అధిక వ్యవయాలు ఉంటాయి. సొమ్ము వృథా అవుతుంది. స్పెక్యులేషన్ వల్ల ఎలాంటి మద్దతు లభించదు. ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. సాధారణ అప్పులు కూడా పుట్టవు. వృత్తిపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్త అవసరం.
భూ క్రయవిక్రయాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాలు స్తంభిస్తాయి. కొనుగోళ్లు వాయిదా వేయండి. ఇంట్లో సామరస్య వాతావరణం ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు వేధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అశ్రద్ధ తగదు.
కుంభ రాశి: (ధనిష్ఠ 3, 4; శతభిష; పూర్వ భాద్ర 1, 2, 3)
ఆర్థికంగా కష్టంగా ఉంటుంది. రావాలసిన బకాయిలు ఆసల్యం అవుతాయి. నియంత్రణలేని ఖర్చలు విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ చేయకండి. వ్తృత్తిపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వాదములలో జాగ్రత్తగా మెలగాలి.
రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాల్లో మోస్తరు ప్రగతి ఉంటుంది. స్థిరాస్థులు జోడించే అవకాశం ఉన్నది. మనసు అంశాంతితో నిండి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇంట్లో ఘర్షణలు నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం, ఔషధాల విషయంలో అశ్రద్ధ చేయవద్దు.
మీనరాశి : (పూర్వ భాద్ర 4; ఉత్తర భాద్ర; రేవతి)
ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. రావాలసిన బకాయిలు ఆలస్యంగా అందుతాయి. నియంత్రణలేని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రణాళికలు, నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. వృత్తిపరంగా స్వల్ప సమస్యలు ఉంటాయి. ఎవ్వరితోనూ వాదములకు దిగకండి. భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ కార్యకలాపాలు స్తంభిస్తాయి.
కొనుగోళ్లు వాయిదా వేయండి. మనసు అశాంతితో నిండి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఇంట్లో తగాదాలను నివారించండి. దీర్ఘకాలిక వ్యాధిగస్థులు ఆహరం, ఔషధాల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. 24.06.2023 నుంచి బుధుడు 4వ ఇంటకు మారుతున్నందున పరిస్థితి కొంత సానుకూలంగా మారే అవకాశం ఉన్నది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు కొంత ఉపశమనం పొందుతారు.