విధాత: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విడతల వారీగా ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు.
ఉపాధ్యాయులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. 317 జీవో వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు వాపోయారు.
కుటుంబానికి దూరంగా ఉంటున్నామని, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టీ సీఎం కేసీఆర్ దీనిపై స్పందించిన స్థానిక జిల్లాలోనే పనిచేసుకునేలా 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.