ఇదేం ఖ‌ర్మ‌: జగన్ పథకాలకు బాబు జైకొట్టారా !

విధాత‌: ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్లి, రానున్న ఎన్నికల్లో జగన్ను నిలువరిస్తారు అనుకున్న చంద్రబాబు అత్యుత్సాహంతోనో, అనాలోచితంగానో తప్పులో కాలేశారు. జగన్ అమలు చేస్తున్న అలవి మాలిన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్నాయని, రాష్ట్రం దివాళా తీస్తోందని, ప్రజలు సోమరులై పోతున్నారని, ప్రగతి నిలిచిపోయిందని, వీటన్నిటికీ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణం అని చెబుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకున్న వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని […]

  • By: krs    latest    Dec 02, 2022 3:31 PM IST
ఇదేం ఖ‌ర్మ‌: జగన్ పథకాలకు బాబు జైకొట్టారా !

విధాత‌: ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్లి, రానున్న ఎన్నికల్లో జగన్ను నిలువరిస్తారు అనుకున్న చంద్రబాబు అత్యుత్సాహంతోనో, అనాలోచితంగానో తప్పులో కాలేశారు. జగన్ అమలు చేస్తున్న అలవి మాలిన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్నాయని, రాష్ట్రం దివాళా తీస్తోందని, ప్రజలు సోమరులై పోతున్నారని, ప్రగతి నిలిచిపోయిందని, వీటన్నిటికీ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణం అని చెబుతూ వస్తున్నారు.

సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకున్న వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని ప్రచారం మొదలు పెట్టారు. దీంతో చంద్రబాబు నాలుక కరుచుకుని మళ్లీ సంక్షేమానికి జైకొట్టారు. జగన్ పథకాలేవీ రద్దు చేయనని చెబుతూనే ఇంకాస్త మెరుగ్గా పథకాలు ఇస్తామన్నారు. ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి అంటూ చంద్ర‌బాబు జ‌నంలోకి వెళ్లారు.

అయితే ఆ కార్య‌క్ర‌మం టీడీపీకి రివ‌ర్స్ అయ్యింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ప‌క్క‌న పెడితే, జ‌గ‌న్ దెబ్బ‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌డానికే స‌రిపోతోంది. ఒక‌వేళ టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌న్నీఆగిపోతాయ‌ని జ‌గ‌న్‌తో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌చారం చేస్తున్నారు.

దీంతో చంద్రబాబు వెంటనే సర్దుకుని టీడీపీ గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయని ఈ చేతగాని నేతలు వలంటీర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మీరు నమ్మొద్దు. మేమొస్తే ఏ సంక్షేమ కార్యక్రమమూ రద్దు కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచి పేదలను మరింత ఎక్కువగా ఆదుకుంటాం’ అని ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చూస్తుంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను బాగా అమ‌లు చేస్తోంద‌ని చంద్ర‌బాబు ఒప్పుకుంటున్నట్లుగా ఉంది.