ఫోన్ ట్యాపింగ్ సమస్యతోనే నాకు నోటీస్‌లు: బక్క జడ్సన్

తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సీనియర్‌ కాంగ్రెస్ నేత బ‌క్క జ‌డ్స‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి ప‌క్క‌న ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డార‌ని

ఫోన్ ట్యాపింగ్ సమస్యతోనే నాకు నోటీస్‌లు: బక్క జడ్సన్

విధాత : తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సీనియర్‌ కాంగ్రెస్ నేత బ‌క్క జ‌డ్స‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి ప‌క్క‌న ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డార‌ని జ‌డ్స‌న్ మీడియాకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లో 4 లక్షల సిమ్‌ల కొనుగోళ్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్‌డీ చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. సీపీ ఆఫీసుకు వెళ్లి 4 ల‌క్ష‌ల సిమ్‌ల వ్య‌వ‌హారాన్ని తాను బ‌య‌ట‌పెట్టిన‌ త‌ర్వాత ట్యాపింగ్ కేసు తిరిగి మాకే చుట్టుకునే అవ‌కాశం ఉంద‌ని రేవంత్‌రెడ్డి బృందం అలెర్ట్ అయ్యారని జడ్సన్ పేర్కోన్నారు. తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని చెప్పి పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన కాంగ్రెస్ దళిత నాయకుడైన త‌న‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశార‌ని జ‌డ్స‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తానేం పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేదని, రాహుల్‌కు మోదీ శ‌త్రువు, పార్టీ బ్యాంకు ఖాతాల‌న్నీ మోదీ సీజ్ చేశారని, అలాంటి మోదీని ప‌ట్టుకుని బ‌డా భాయ్ అని అన్న‌ది రేవంత్ రెడ్డినే క‌దా..? అది క‌దా పార్టీకి వ్యతిరేకమంటే ? వీట‌న్నింటికి రేవంత్ రెడ్డి స‌మాధానం చెప్పాలని జడ్సన్ డిమాండ్ చేశారు.