Bandi Sanjay | మంత్రి ‘గంగుల’ ఎన్నిక చెల్ల‌దు.. హైకోర్టులో ఎంపీ బండి సంజయ్‌ పిటిష‌న్‌

Bandi Sanjay | 2018 ఎన్నిక‌ల్లో త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశార‌ని పిటిష‌న్ దాఖ‌లు త‌దుప‌రి విచార‌ణ ఆగ‌స్టు 21కి వాయిదా హైద‌రాబాద్‌, విధాత: 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల క‌మలాక‌ర్ ఎన్నిక చెల్ల‌దంటూ బీజేపీ క‌రీంన‌గ‌ర్ ఎంపీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఎన్నిక చెల్ల‌ద‌ని, ఆ ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆయ‌న […]

  • Publish Date - July 31, 2023 / 02:43 PM IST

Bandi Sanjay |

  • 2018 ఎన్నిక‌ల్లో త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశార‌ని పిటిష‌న్ దాఖ‌లు
  • త‌దుప‌రి విచార‌ణ ఆగ‌స్టు 21కి వాయిదా

హైద‌రాబాద్‌, విధాత: 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంగుల క‌మలాక‌ర్ ఎన్నిక చెల్ల‌దంటూ బీజేపీ క‌రీంన‌గ‌ర్ ఎంపీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఎన్నిక చెల్ల‌ద‌ని, ఆ ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆయ‌న త‌ప్పుడు నివేదిక స‌మ‌ర్పించార‌ని బండి సంజ‌య్ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ ప‌టిష‌న్‌పై సోమ‌వారం జ‌స్టిస్ సుమ‌ల‌త విచార‌ణ చేపట్టింది. పిటిష‌న‌ర్ క్రాస్ ఎగ్జామినేష‌న్ కోసం రిటైర్డ్ జిల్లా న్యాయ‌మూర్తి శైల‌తో కమిష‌న్
ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి 18 తేదీలోపు క్రాస్ ఎగ్జామినేష‌న్ పూర్తి చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా బండి సంజ‌య్ పిటిష‌న్‌లో పేర్కొన్న అన్ని అంశాల‌కు సంబంధించి ఆధారాల‌ను క‌మిష‌న్‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని, త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 21కి వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది.