Bandi Sanjay | కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ విడుదల

లీకు లిక్కర్ వీరులు కేసీఆర్ కుటుంబ సభ్యులే పోలీసులకు ఎమోషనల్ తెలవాలంటే బలగం సినిమా చూపించాల్సిందే కరీంనగర్ వరంగల్ పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా ఓ ఎంపీ పట్ల వారు వ్యవహరించే తీరు ఇదేనా? గ్రూప్స్, పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి వరంగల్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ అన్ని జిల్లాలలో నిరుద్యోగ మార్చ్ పరీక్షల కారణంగా నష్టపోయిన […]

  • Publish Date - April 7, 2023 / 01:05 AM IST
  • లీకు లిక్కర్ వీరులు కేసీఆర్ కుటుంబ సభ్యులే
  • పోలీసులకు ఎమోషనల్ తెలవాలంటే బలగం సినిమా చూపించాల్సిందే
  • కరీంనగర్ వరంగల్ పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా
  • ఓ ఎంపీ పట్ల వారు వ్యవహరించే తీరు ఇదేనా?
  • గ్రూప్స్, పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
  • మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి
  • వరంగల్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ
  • అన్ని జిల్లాలలో నిరుద్యోగ మార్చ్
  • పరీక్షల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి లక్ష పరిహారం ఇవ్వాలి
  • సింగరేణి ప్రైవేటీకరణ కుట్ర రాష్ట్రానిదే
  • రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. పదవ తరగతి ప్రస్తాపత్రాల లీకేజ్ కేసులో 14 రోజుల రిమాండ్ లో ఉన్న ఆయనకు హనుమకొండ జిల్లా న్యాయస్థానం గురువారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది.

బండి సంజయ్ జైలు నుండి విడుదల అవుతుండడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. జైలు వైపు ఎవరు వెళ్లకుండా బారికెడ్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కింద నిషేదాజ్ఞలు విధించారు.

టీఎస్పీఎస్, పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మంత్రి కే తారక రామారావును బర్తరఫ్ చేయాలని కోరారు. త్వరలో వరంగల్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు.

లీక్ లిక్కర్ వీరులు ఎవరైనా ఉన్నారంటే అది కెసిఆర్ కుటుంబ సభ్యులే అని దుయ్యబట్టారు.
తన మీద పిడి యాక్ట్ పెట్టాలని వ్యాఖ్యానించిన మంత్రి తీరుపై బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.అగ్గిపెట్టె మంత్రి(హరీష్ రావు) నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఉద్రేకపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో వందల ప్రాణాలు బలికొన్న బీఆర్ఎస్ ప్రస్తుతం వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. కెసిఆర్ బిడ్డ తొలుత, కొడుకు తరువాత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జాతీయ రాజకీయాల్లో విపక్ష కూటమికి తనను చైర్మన్ గా ప్రకటిస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు ఎంత భరిస్తానని కెసిఆర్ చెప్పినట్టు సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరగాల్సి ఉందన్నారు.

TSPSC లీకేజి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. పరీక్షల లీకేజ్ కారణంగా నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల వ్యవహారంలో హిందీ పేపర్ లీక్ చేశామని మాపై ఆరోపణ చేసి కేసు నమోదు చేశారు.. మరి పరీక్షల మొదటి రోజే తెలుగు పేపర్ ని ఎవరు లీక్ చేసారు? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని సూటిగా ప్రశ్నించారు.

ప్రశ్న పత్రాల లీకేజ్ పై తమపై నిందవేసిన వరంగల్ సిపి తన టోపీ పక్కన పెట్టి ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిగా జరుగుతున్న పరిణామాలు ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఎవరో నాకు పేపర్ పంపిస్తే అందులో తన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో కొందరు పోలీస్ వ్యవస్థ కి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని,ఓ లోక్ సభ సభ్యునితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అని మండపడ్డారు.

మా అత్త దశ దిన కర్మ లో నేను పాల్గొని ఉండాల్సిన సమయంలో పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్ళడాన్ని ప్రస్తావిస్తూ, వారికి కనీస ఎమోషన్స్ లేవన్నారు. కొంత మంది పోలీస్ అధికారుల వ్యవహారం వల్ల కింది స్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మొబైల్ ఫోన్ ఇవ్వాలని కోరుతున్న పోలీసులపై ఆయన నా మొబైల్ ఫోన్ వారికి ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ప్రశ్న పత్రాల లీకేజ్ తో రాష్ట్రం ఆందోళనలతో అట్టుడికి పోతుంటే ముఖ్యమంత్రి మాత్రం బయటకు రావడం లేదన్నారు.

సీఎం సార్ ఇప్పటికైనా బయటకి రావాలని కోరారు బండి సంజయ్. కరీంనగర్ ,వరంగల్ పోలీస్ తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నా ఇంటి మీద దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన కొంతమంది పోలీస్ లు తమను కాపాడమని కెసిఆర్ ని అడగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. పోలీసులకు ఎమోషన్ అంటే ఏమిటో తెలియాలంటే వారికి బలగం సినిమా చూపించాల్సి ఉంటుందన్నారు.

ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలలో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చిన మంత్రి కే తారక రామారావు పై బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే అని, కేంద్రం పేరు చెబుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు రాష్ట్రం నాటకాలు ఆడుతుంది అన్నారు.