Bandi Sanjay | సంజయ్ స్వరం మారుతున్నది.. ఎందుకో?
Bandi Sanjay | విధాత: 'తాము అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం, ధరణి కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఉన్నది. అందులో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని' బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధరణి వల్ల రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. తాము అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొంతకాలంగా చెబుతున్నారు. కానీ నిత్యం బీఆర్‌ఎస్ […]

Bandi Sanjay |
విధాత: ‘తాము అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం, ధరణి కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఉన్నది. అందులో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధరణి వల్ల రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది.
తాము అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొంతకాలంగా చెబుతున్నారు. కానీ నిత్యం బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి, పాలనలో విఫలమైందని అని సంజయ్ సహా బీజేపీ నేతల నిత్యం విమర్శలకు విలువ లేదంటున్నారు. బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సంజయ్ స్వరం మార్చడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ జరుగుతున్నది.
అలాగే కేసీఆర్ కుటుంబ కోసమే పనిచేస్తున్నారని, బీఆర్‌ఎస్ కాంగ్రెస్ రాష్ట్ర సమితిగా మారడం ఖాయమని సంజయ్ విమర్శించారు. కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేసే బీజేపీలోనే వారసత్వ రాజకీయాలు లేవా అన్న విమర్శలకు సమాధానం ఉండదు. అంతేకాదు మొన్నటికి మొన్న కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలని జేడీఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆపార్టీ వచ్చే లోక్‌సభలో ఆ పార్టీతో కలిసి పనిచేయనున్నదనే వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసే బీజేపీ నేతలకు రేవంత్ అనేకసార్లు సవాల్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇస్తాను కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై సీబీఐ విచారణ జరిపించే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అందుకే బీఆర్‌ఎస్, బీజేపీ వేరు కాదు ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.
అలాగే బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పార్టీ బలోపేతానికి, అధికార పార్టీలోని అసంతృప్తి నేతలను పార్టీలోకి ఆహ్వానించడానికి చేసిన ప్రయత్నాలను సంజయ్ అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య తాను గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల అన్నారు. దీనిపై సంజయ్ స్పందిస్తూ.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ఈటలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. సంజయ్ మాటల యాధృచ్ఛికంగా చేసినవి కాదు. కేసీఆర్ ను సవాల్ చేసిన ఈటల రాజేందర్ బహిరంగంగానే అనేకసార్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ప్రతిస్పందన లేదు.
కానీ సంజయ్ లాంటి వాళ్లే ఈటల వర్గానికి చెక్ పెట్టేలా వ్యవహరించారు. అందుకే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు గల్లిలో కొట్లాడుతారు.. ఢిల్లీలో అవగాహనతోనే ఉంటారని కాంగ్రెస్ నేతల వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలకు బలం చేకూర్చేలా ఇటివల పరిణామాలు ఉన్నాయి అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై సంజయ్ స్వరం మారుతున్నది.. ఎందుకో అన్నది రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పోటీ సీరియస్‌గా ఉంటుందా? లేక ఫ్రెండ్లీ పోటీ ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.