బండ్ల గణేష్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష..

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి బండ్ల గ‌ణేష్ బుధ‌వారం హాజరయ్యారు

  • By: Somu    latest    Feb 14, 2024 12:12 PM IST
బండ్ల గణేష్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష..
  • 95 ల‌క్ష‌ల జ‌రిమానా, జైలు
  • చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు తీర్పు


ప్రకాశం: సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి బండ్ల గ‌ణేష్ బుధ‌వారం హాజరయ్యారు. బండ్ల గ‌ణేష్‌కు ఏడాది జైలు శిక్ష, 95 లక్షలు జరిమానాను సెకండ్ ఏఎంఎం కోర్టు విధించింది.


అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. 2019లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గ‌ణేష్‌ రూ.95 లక్షలు తీసుకున్నారు. పూచీగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో వెంక‌టేశ్వ‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు.