Viral Video | ప్రాణాల‌ను బ‌లిగొన్న స‌ర‌దా.. భార్య‌ను లాక్కెళ్లిన రాకాసి అల‌లు..

Viral Video | స‌ర‌దాగా గ‌డుపుదామ‌ని స‌ముద్ర‌పు ఒడ్డుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. స‌ముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ల వ‌ద్ద కూర్చొని దంప‌తులిద్ద‌రూ ఫోటోలకు ఫోజులిస్తుండ‌గా.. రాకాసి అల‌లు భార్యను లాక్కెళ్లాయి. ఈ ఘ‌ట‌న త‌మ పిల్ల‌ల క‌ళ్ల ముందే చోటు చేసుకోవ‌డంతో.. వారు త‌ల్లి కోసం త‌ల్ల‌డిల్లిపోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ముకేశ్, జ్యోతి సోనార్(32) అనే దంప‌తులిద్ద‌రూ త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి జుహు చౌప‌ట్టికి వెళ్లారు. అక్క‌డ అల‌ల […]

Viral Video | ప్రాణాల‌ను బ‌లిగొన్న స‌ర‌దా.. భార్య‌ను లాక్కెళ్లిన రాకాసి అల‌లు..

Viral Video | స‌ర‌దాగా గ‌డుపుదామ‌ని స‌ముద్ర‌పు ఒడ్డుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. స‌ముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ల వ‌ద్ద కూర్చొని దంప‌తులిద్ద‌రూ ఫోటోలకు ఫోజులిస్తుండ‌గా.. రాకాసి అల‌లు భార్యను లాక్కెళ్లాయి. ఈ ఘ‌ట‌న త‌మ పిల్ల‌ల క‌ళ్ల ముందే చోటు చేసుకోవ‌డంతో.. వారు త‌ల్లి కోసం త‌ల్ల‌డిల్లిపోయారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ముకేశ్, జ్యోతి సోనార్(32) అనే దంప‌తులిద్ద‌రూ త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి జుహు చౌప‌ట్టికి వెళ్లారు. అక్క‌డ అల‌ల ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో బీచ్‌లోకి అధికారులు అనుమ‌తించ‌ లేదు. దీంతో వారు త‌మ స్పాట్‌ను బాంద్రా ఫోర్ట్‌కు మార్చుకున్నారు. ఇక్క అక్క‌డ పిల్ల‌ల‌తో క‌లిసి దంప‌తులిద్ద‌రూ స‌ర‌దాగా గ‌డిపారు. ఫోటోలు దిగేందుకు ఒడ్డున ఉన్న రాళ్ల‌పైకి వెళ్లారు. అల‌లు వ‌స్తుండ‌గా ఫోటోలు దిగారు.

అంత‌లోనే రాకాసి అల‌లు జ్యోతిని లాక్కెళ్లాయి. దీంతో భ‌ర్త ఆమె చీర‌ను ప‌ట్టుకుని లాగాడు. అత‌ను కూడా అల‌ల ధాటికి కొట్టుకుపోవ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. అత‌న్ని బ‌య‌ట‌కు లాగారు. జ్యోతి స‌ముద్రంలో కొట్టుకుపోయింది. పోలీసులు ఆమె మృత‌దేహాన్ని వెలికితీశారు.

అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న వారి పిల్ల‌లు మ‌మ్మీ మ‌మ్మీ అంటూ కేక‌లు వేశారు. నీళ్ల‌లో కొట్టుకుపోతున్న తమ త‌ల్లిని చూసి వారు బోరున విల‌పించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.