Bank Rules and Regulations | బ్యాంకు దివాళా తీస్తే ఖాతాదారుల పరిస్థితి ఏంటీ..? అకౌంట్లలో రూ.లక్షలుంటే చేతికి వచ్చేదెంతా..?
Bank Rules and Regulations | ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ సొంత బ్యాంకు ఖాతా ఉంటున్నది. తల్లిదండ్రులకే కాకుండా పిల్లలకు సైతం ఖాతాలుంటున్నాయి. పలువురు ఉద్యోగాలు చేస్తుండగా నెలవారీ జీతం ఖాతాల్లో అమవుతున్నది. మరికొందరు తమ డబ్బును బ్యాంకుల్లో ఉంటే డిపాజిట్ చేస్తుంటారు. ఆయా డిపాజిట్లకు బ్యాంకులు సైతం వడ్డీని చెల్లిస్తున్నాయి. బ్యాంకుల్లో ఉంటేనే తమ డబ్బుకు భద్రత ఉంటుందని భావిస్తుంటారు. అయితే, కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులు దివాళా తీసినా లేదంటే.. మరేదైనా కారణంతో బ్యాంకు […]

Bank Rules and Regulations | ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ సొంత బ్యాంకు ఖాతా ఉంటున్నది. తల్లిదండ్రులకే కాకుండా పిల్లలకు సైతం ఖాతాలుంటున్నాయి. పలువురు ఉద్యోగాలు చేస్తుండగా నెలవారీ జీతం ఖాతాల్లో అమవుతున్నది. మరికొందరు తమ డబ్బును బ్యాంకుల్లో ఉంటే డిపాజిట్ చేస్తుంటారు. ఆయా డిపాజిట్లకు బ్యాంకులు సైతం వడ్డీని చెల్లిస్తున్నాయి. బ్యాంకుల్లో ఉంటేనే తమ డబ్బుకు భద్రత ఉంటుందని భావిస్తుంటారు.
అయితే, కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులు దివాళా తీసినా లేదంటే.. మరేదైనా కారణంతో బ్యాంకు మూతపడినా డిపాజిటర్లు, ఖాతాదారుల సొమ్ము ఏమవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. బ్యాంకు మూసివేత నేపథ్యంలో చేతికి ఎంత డబ్బు వస్తుంది? అనే డౌట్ సహజంగా అందరికీ వస్తుంటుంది. బ్యాంకుల దివాళా, మూసివేత సమయంలో ఖాతాల్లో సమ చేసిన మొత్తం నుంచి ఎంత డబ్బును ఖాతాదారులు తిరిగి పొందుతారనే విషయాన్ని తెలుసుకుందాం..!
బ్యాంకు దివాళా తీస్తే చేతికి వచ్చేదెంత.. ?
బ్యాంకు దివాళాకు కారణం సాధారణంగా రుణాలు రికవరీ కాకపోవడం. వాస్తవానికి బ్యాంకు రుణాలు ఇచ్చిన సమయంలో.. పెరుగుతూ పోతే డబ్బు తిరిగి రాకపోతే.. అప్పుడు బ్యాంకు నష్టాల్లోకి వెళ్లి మూతపడే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి. అయితే, మీకు ఖాతా ఉన్న బ్యాంకు, కొన్ని కారణాలతో దాన్ని మూసివేసినా.. లేకపోతే దివాళా తీసిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఖాతాదారులకు రూ.5లక్షలు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేసినా అంతే సొమ్ము తిరిగి చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ బ్యాంకులు..
ప్రభుత్వ బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితుల్లో ఖాతాదారులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దివాళా అంచున ఉన్న బ్యాంకులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ బ్యాంకును మరో బ్యాంకుతో విలీనం చేస్తుంది. తద్వారా ప్రజలకు కష్టపడి సంపాదించిన డబ్బు మునిగిపోకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
ఆర్‌బీఐ నిఘా..
ప్రతి బ్యాంకు రుణాలు, లావాదేవీలపై ఆర్‌బీఐ నిశితంగా నిఘా ఉంచుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బ్యాంకు కూడా మునిగిపోకముందే కఠిన నిర్ణయం తీసుకుని సామాన్యుల సొత్తుకు భరోసా కల్పిస్తున్నాడు. బ్యాంకు దివాళా తీస్తే.. ప్రజలకు వారి డబ్బు ఇచ్చే బాధ్యతను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) తీసుకుంటుంది. అదే సమయంలో బదులుగా డీఐసీజీసీ బ్యాంకుల నుంచి ప్రీమియం తీసుకుంటుంది.