బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్.. 2024 జనవరిలో 16 రోజులు మూతపడనున్న బ్యాంకులు..!
డిసెంబర్ నెలాఖరుకు చేరుకుంది. 2024 జనవరి బ్యాంకులకు సంబంధించి సెలవుల లిస్ట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది

Bank Holidays | డిసెంబర్ నెలాఖరుకు చేరుకుంది. 2024 జనవరి బ్యాంకులకు సంబంధించి సెలవుల లిస్ట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. కొత్త సంవత్సరం తొలి నెలలో 16 రోజుల పాటు బ్యాంకులు మూసే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. అయితే, రెండు, నాలుగో శనివారాలు కాకుండా 11 రోజులు బ్యాంకులు మూతపడుతాయని పేర్కొంది.
పలు రాష్ట్రాల్లో స్థానిక సెలవులు ఆధారంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులు పని చేయకపోయినా మొబైల్, ఇంటర్‌నెట్, యూపీఐ తదితర బ్యాంకు సేవలను కొనసాగనున్నాయి. అయితే, కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ముందస్తుగా సెలవుల గురించి తెలుసుకుంటే ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే పనులు పూర్తి చేసుకునే వీలుంటుంది.
సెలవుల లిస్ట్ ఇదే..
జనవరి 1 : నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంకులు మూసివేత.
జనవరి 7 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 11 : మిషనరీ డే కావడంతో మిజోరంలో బ్యాంకులు పని చేయవు.
జనవరి 12 : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మూతపడనున్న బ్యాంకులు.
జనవరి 13 : సెకండ్ శనివారం సందర్భంగా బ్యాంకులు మూసివేత.
జనవరి 14 : ఆదివారం (సంక్రాంతి) సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
జనవరి 15 : పొంగల్, తిరువళ్లూర్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బ్యాంకులకు మూసివేత.
జనవరి 16 : తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోంలో బ్యాంకులకు సెలవులు.
జనవరి 17 : గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
జనవరి 21 : ఆదివారం కావడంతో బ్యాంకుల మూసివేత.
జనవరి 23 : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో పూతపడనున్న బ్యాంకులు.
జనవరి 25: హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
జనవరి 26: రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.
జవనరి 27: నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేత.
జనవరి 28 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సెలవు.
జనవరి 31: మిడామ్ మే ఫి సందర్భంగా అసోంలో బ్యాంకులకు మూసే ఉంటాయి.