Ys Jagan | ఎన్నికలకు రెడీగా ఉండండి.. మంత్రులకు సీఎం వైయస్ జగన్ సూచన
Ys Jagan | ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా ? చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రేపు, గురువారం నుంచి శాసన సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సభలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ వంటి పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐదు రోజులు శాసన సభ సమావేశాలు జరగనుండగా బుధవారం మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులవద్ద సీఎం వైయస్ జగన్ పలు అంశాలు […]

Ys Jagan |
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా ? చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రేపు, గురువారం నుంచి శాసన సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సభలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ వంటి పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐదు రోజులు శాసన సభ సమావేశాలు జరగనుండగా బుధవారం మంత్రిమండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రులవద్ద సీఎం వైయస్ జగన్ పలు అంశాలు ప్రస్తావిస్తూ రానున్న ఎన్నికల గురించి సైతం మాట్లాడినట్లు తెలిసింది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు మీరు మాత్రం సిద్ధంగా ఉండండి అని అయన వారికి సూచించారని తెలిసింది.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ వన్ నేషన్ ఒన్ ఎలక్షన్ దిశగా ఆలోచన చేస్తున్న సమయంలో అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో సైతం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దసరా నుంచి విశాఖలో మకాం ఉండేందుకు జగన్ నిర్ణయించుకోగా ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతోబాటు అదే సమయంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్కాంలను బయట పెట్టాలని మంత్రులకు సీఎం సూచించారు. మంత్రులు ఇక సీరియస్ గా పని చేయాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పారు. అయితే కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అని సీఎం అన్నట్లు తెలిసింది.