విధాత: బెంగళూరు: తెగిపోయిన పురుషాంగాన్ని ఆపరేషన్ చేసి అతికించారు బెంగళూరు వైద్యులు. నైజీరియాలో ఆరు నెలల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మర్మాంగం పూర్తిగా తెగిపోయింది. తెగిపడ్డ మర్మాంగాన్ని బెంగళూరులోని ఫోర్టీస్ ఆసుపత్రిలో ప్రత్యేక శస్త్ర చికిత్సతో తిరిగి అతికించారు. యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మోహన్ కేశవమూర్తి ఆధ్వర్యంలో ఈ అరుదైన శస్త్ర చికిత్స చేశారు. రెండు దశల్లో శస్త్ర చికిత్స చేసిన అనంతరం […]
విధాత: బెంగళూరు: తెగిపోయిన పురుషాంగాన్ని ఆపరేషన్ చేసి అతికించారు బెంగళూరు వైద్యులు. నైజీరియాలో ఆరు నెలల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మర్మాంగం పూర్తిగా తెగిపోయింది.
తెగిపడ్డ మర్మాంగాన్ని బెంగళూరులోని ఫోర్టీస్ ఆసుపత్రిలో ప్రత్యేక శస్త్ర చికిత్సతో తిరిగి అతికించారు. యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మోహన్ కేశవమూర్తి ఆధ్వర్యంలో ఈ అరుదైన శస్త్ర చికిత్స చేశారు.
రెండు దశల్లో శస్త్ర చికిత్స చేసిన అనంతరం మూత్ర విసర్జనకు సమస్య లేకుండా చేశామని మోహన్ కేశవమూర్తి వివరించారు. మరోసారి ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని, ఈ దశలో మూత్రనాళాలను ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఆరు నెలల అనంతరం బాలుడికి మరో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలుడు పెరిగి పెదయ్యాక వైవాహిక జీవితం గడిపేందుకు సైతం ఎలాంటి సమస్య ఉండదన్నారు