Bengaluru | ఓ బాలిక తప్పుడు ఫిర్యాదు.. డెలివరీ ఏజెంట్‌ను చితక్కొట్టిన అపార్ట్‌మెంట్ వాసులు
Bengaluru | ఓ ఎనిమిదేళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతోనే వెనకా ముందూ ఆలోచించకుండా ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను అపార్ట్‌మెంట్ వాసులు కుళ్లబొడిచిన ఘటన ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది. ఇక్కడి ఎలక్ట్రానికి సిటీలో గతవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజున ఉదయం.. బాలికను వెతుక్కుంటూ వెళ్లిన తల్లిదండ్రులకు.. టెర్రస్ మీద తను కనిపించింది. ఇక్కడ ఏం చేస్తున్నావని అడగ్గా ఒక డెలివరీ ఏజెంట్(Delivery Agent) తనను ఇక్కడకి తీసుకొచ్చాడని, అతడి చేతిని […]

Bengaluru |
ఓ ఎనిమిదేళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతోనే వెనకా ముందూ ఆలోచించకుండా ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను అపార్ట్‌మెంట్ వాసులు కుళ్లబొడిచిన ఘటన ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది. ఇక్కడి ఎలక్ట్రానికి సిటీలో గతవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన రోజున ఉదయం.. బాలికను వెతుక్కుంటూ వెళ్లిన తల్లిదండ్రులకు.. టెర్రస్ మీద తను కనిపించింది. ఇక్కడ ఏం చేస్తున్నావని అడగ్గా ఒక డెలివరీ ఏజెంట్(Delivery Agent) తనను ఇక్కడకి తీసుకొచ్చాడని, అతడి చేతిని బలవంతంగా కొరికేయడంతో పారిపోయాడని చెప్పింది.
ఈ మాటలను నమ్మిన తల్లిదండ్రలు హౌసింగ్ సొసైటీ సెక్యురిటీకి ఫోన్ చేసి సొసైటీ గేట్లు మూసేయమని చెప్పారు. అనంతరం అక్కడున్న వారందరినీ బాలికకు చూపించగా.. ఒక డెలివరీ ఏజెంట్ వైపు వేలెత్తడంతో.. సొసైటీ వాసులందరూ సదరు వ్యక్తిని కుళ్లబొడిచారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా.. బాలిక తనంతట తానే టెర్రస్ పైకి వెళ్లినట్లు అందులో రికార్డైంది. దీనిపై పోలీసులు బాలికను ప్రశ్నించగా.. స్కూలుకు వెళ్లకుండా ఆడుకుంటుండటంతో తల్లిదండ్రులు తిడతారని భయపడ్డానని, అందుకే అబద్ధం చెప్పానని తెలిపింది.
ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. ‘ముందుగా పోలీసులకు ధన్యవాదాలు. వారు సీసీటీవీ ఫుటేజీ చూడటం వల్లే నేను బయటపడ్డాను. అక్కడ సీసీటీవీలు లేకుంటే నా పరిస్థితి ఏమయ్యేదని భయంగా ఉంది. అని వాపోయాడు. సదరు బాలిక తల్లిదండ్రులు బాధితుడికి క్షమాపణలు చెప్పి చేతులు దులిపేసుకున్నారు.