బెంగళూరు నగరంలో మరో ఘోరం చోటు చేసుకున్నది. నడుస్తున్న కారులో ఒక యువతిపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక పార్క్‌లో కూర్చున్న జంటను బెదిరించిన యువకులు.. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని దారుణానికి పాల్పడ్డారు.
విధాత: పార్క్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి కూర్చొన్న యువతిని నలుగురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆ నలుగురినీ అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు.
On 25th around 9pm a female ws inside a park with hr male friend at NGV #Bengaluru.One person questioned them afterwhich male friend left,bt person who questioned them called 3 guys & took female in their car,raped her till 3am in a moving car.All accused arrested. @DCPSEBCP pic.twitter.com/aAeEcchgYY
— Yasir Mushtaq (@path2shah) March 31, 2023
పోలీసుల కథనం ప్రకారం ఈ గటన మార్చి 25వ తేదీన చోటు చేసుకున్నది. ఒక యువతి తన ఫ్రెండ్‌తో కలిసి కోరమంగళ వద్ద ఉన్న నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్‌లో కూర్చొని ఉన్నది. నిందితుల్లో ఒకడైన యువకుడు వారిని సమీపించి.. ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నరంటూ బెదిరించాడు.
భయపడిన పోయిన ఆ యువతి ఫ్రెండ్ పారిపోగానే.. నిందితుడు తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించి బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని పోయాడు. అలా నలుగురూ కారు నడుస్తూ ఉండగానే ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు.
తెల్లవారుజామున ఆమె ఇంటికి సమీపంలో వదిలేసి వెళ్లారు. ఈ సంగతి పోలీసులకు చెబితే ప్రాణాలు దక్కవని బెదిరించారు. కానీ.. ఆమె కుటుంబీకులతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లారు. ఆమె చెప్పిన వివరాల మేరకు నిందితులను గుర్తించిన పోలీసులు.. నలుగురినీ అరెస్టు చేశారు.
వారిని ఇంటరాగేట్ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు అధికారి సీకే బాబా తెలిపారు. బాధితురాలు వైద్యం కోసం హాస్పిటల్‌కు వెళ్లి, తమకు ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్టు చెప్పారు.