తెలంగాణ SC,ST కమిషన్ చైర్మన్‌గా భక్కి వెంకటయ్య నియామకం

తెలంగాణ SC,ST కమిషన్ చైర్మన్‌గా భక్కి వెంకటయ్య నియామకం

మెదక్ ఉమ్మడి జిల్లా భూంపల్లి గ్రామ ముద్దుబిడ్డ

అంచలంచెలుగా ఎదిగిన బక్కి

మాజీ మంత్రి ముత్యం రెడ్డి శిష్యునిగా…రాజకీయ అరంగేట్రం….

దుబ్బాక జడ్పీటీసీగా, డీసీసీబీ డైరెక్టర్ గా పదవుల అలంకరణ

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర, ఎస్ సి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మెదక్ ఉమ్మడి జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి వెంకటయ్య ను ప్రభుత్వం నియమించింది.మంత్రి హరీష్ రావు అండదండలతో బక్కికి ఈ పదవి లభించింది.మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి కి అనుంగ శిష్యునిగా గతంలో ఉన్నారు.టీడీపీ హయాంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు.దుబ్బాక జెడ్పీటీసీ గా టీడీపీ పార్టీ తరపున ఎన్నికయ్యారు.ప్రస్తుతం మిరుదొడ్డి మండల సహకార సంఘం అధ్యక్షునిగా డీసీసీబీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

2014 ఎన్నికల తరువాత 2015 లో తెరాస లోకి వచ్చిన బక్కీ వెంకటయ్య ఎమ్మెల్యే పదవిని ఆశించారు.ఆందోల్ నియోజక వర్గ తెరాస అభ్యార్టిగా ప్రచారం జరిగింది.జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ బక్కి ఆశయానికి గండి కొట్టారు.కెటిఆర్ చొరవతో క్రాంతి పార్టీలోకి రాగా బక్కి ఆశలు గల్లంతయ్యాయి.సీఎం కెసిఆర్,మంత్రి హరీష్ రావు,లు బక్కి సేవలను గుర్తించి రాష్ట్ర ఎస్ సి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించారు.ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు లో బక్కికీలక పాత్ర పోషించాలని ఈ పదవిని కట్ట బెట్టినట్లు తెలుస్తోంది. బక్కివెంకటయ్య ఉన్నత విద్యా వంతుడు.యం ఏ ..పొలిటికల్ సైన్స్..చదివారు..