Bhatti Vikramarka |కేసిఆర్ నియంత పాలన అంతానికే పాదయాత్ర: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka అవినీతి మంత్రి జగదీష్‌రెడ్డి: వెంకట్ రెడ్డి ధ్వజం విధాత: తెలంగాణ సెంటిమెంటు పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన విద్యార్థుల అమరుల బలిదానాలను విస్మరించి నియంతృత్వ, అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ పాలన అంతానికే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుందని సీల్ఫీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వేయికిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం కొండమల్లేపల్లి వద్ద […]

Bhatti Vikramarka |కేసిఆర్ నియంత పాలన అంతానికే పాదయాత్ర: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

  • అవినీతి మంత్రి జగదీష్‌రెడ్డి: వెంకట్ రెడ్డి ధ్వజం

విధాత: తెలంగాణ సెంటిమెంటు పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన విద్యార్థుల అమరుల బలిదానాలను విస్మరించి నియంతృత్వ, అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ పాలన అంతానికే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుందని సీల్ఫీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వేయికిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు.

అనంతరం కొండమల్లేపల్లి వద్ద జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజన లకు ఇచ్చిన అటవీ భూములను, అసైన్ భూములను అక్రమంగా లాగేసుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి గొర్రె పిల్లలు, బర్రెలు, చేప పిల్లలతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు కర్ణాటకలో సీఎం పదవితో రాజ్యాధికారం ఇచ్చిందన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పులపాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దే దించకపోతే రాష్ట్రం మరింత అప్పల పాలవుతుందన్నారు. ప్రజల సొమ్ముతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

దొరల ప్రభుత్వాన్ని గద్దె దించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు రుణాలు, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఇంటి నిర్మానాణికి ఐదు లక్షల రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, అందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు.

తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామన్నారు. రైతుబంధు మాదిరిగానే భూమి లేని పేదలకు ఏటా 12 వేల రూపాయల అందిస్తామన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ విమర్శిస్తున్న జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టుల పూర్తికి కేవలం 1000 కోట్లు మంజూరు చేయించలేకపోయారన్నారు.

జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సొరంగం ప్రాజెక్టును సందర్శించి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ఏనాడైనా ఆయన సమీక్ష చేశార అంటూ భట్టి ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిలు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తికి నిధులు సాధించలేకపోయారన్నారు.

కాంగ్రెస్ హయాంలో జిల్లా నుండి జానారెడ్డి ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి వారు మంత్రులుగా పని చేశారని వారు కాంట్రాక్టుల కోసమో, పైరవీల కోసమో ఫామ్ హౌజ్ ల కోసమో, ఆస్తుల సంపాదన కోసం మంత్రులు కాలేదన్నారు. మంత్రిగా వెంకటరెడ్డి జిల్లాకు ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు మంజూరు సాధించేందుకు ఆనాటి సీఎం వైఎస్సార్ పై ఒత్తిడి చేసి ఈ జిల్లా ప్రజలకు మేలు చేశారన్నారు. కాంగ్రెస్ మంత్రులుగా వారు జిల్లా అభివృద్ధికి చేసిన కృషి విస్మరించలేనిది అన్నారు.

మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భట్టి పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో దుర్మార్గ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించాలన్నారు. ఎంతోమంది పిల్లలు ఈరోజు నిరుద్యోగులుగా మారారన్నారు. జిల్లా సాగుతాగు నీటి సమస్యల పరిష్కారం కోసం 2005 ఆగస్టు 11న 1880 కోట్లతో శ్రీశైలం శ్రీరంగం ప్రాజెక్టు మంజూరు చేయించి 2008లో పనులు మొదలుపెట్టించగా 60 శాతం పూర్తి చేశామన్నారు.

2014లో కుర్చీ వేసుకుని సొరంగం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కాలేశ్వరం కు రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి లక్ష కోట్లు కమిషన్ దోచుకున్నాడన్నారు. శ్రీశైలం సోరంగం ప్రాజెక్టు మాత్రం ఎక్కడి వేసినట్లు అక్కడే ఉందన్నారు. మన జిల్లా ప్రజలు, రైతులు కేసీఆర్ దృష్టిలో మనుషులుగా కనిపించడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ కారణంగా జిల్లా నాశనమైందని, తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలోనే జిల్లా అభివృద్ధి జరిగిందంటున్న జగదీష్ రెడ్డి అవినీతి మంత్రిగా తయారయ్యాడన్నారు. మూడు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టులను కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు.

ఎస్సారెస్పీ రెండో దశలో సాధించామన్నారు. తనతో పాటు జానారెడ్డి , ఉత్తమ్, ఆస్తులన్నీ కలిపిన నాగారంలో మంత్రి జగదీష్ రెడ్డి ఇల్లు, ఫామ్ హౌజ్ అంతా కాదన్నారు. అవినీతి సంపాదనతో మొయినాబాద్ లో జగదీష్ రెడ్డి 2500 కోట్లతో 80 ఎకరాల ఫామ్ హౌస్ నిర్మించుకున్నారన్నారు. ప్రజల కోసం ఎండ, వానల్లో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నాడని వేలకోట్లు జగదీష్ రెడ్డి విమర్శించడం అన్యాయంగా వుందన్నారు.

కొడుకల్లారా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జగదీష్ రెడ్డి వంటి వారి అక్రమార్కుల భరతం పడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిచి, రాష్ట్రంలో అధికారం సాధిస్తుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయన్నారు.

రానున్న మూడు నాలుగు నెలలు పార్టీ కార్యకర్తలంతా కష్టపడి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ , డిసిసి అధ్యక్షుడు శంకర నాయక్ , దేవరకొండ నియోజకవర్గం బిల్యా నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.