డిప్యూటీ సీఎం హోదాలో సీఎల్పీ కార్యాలయానికి భట్టి
తెలంగాణ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భట్టి విక్రమార్క తొలిసారిగా శుక్రవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు.

- అభినందించిన వీహెచ్, కోదండ రెడ్డి
విధాత: తెలంగాణ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భట్టి విక్రమార్క తొలిసారిగా శుక్రవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీఎల్పీ సెక్రెటరీ శ్రీకాంత్, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఈ సందర్భంగా మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ హన్మంతరావు, కిసాన్ సెల్ జాతీయ నాయకులు కోదండ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానేశ్వర్, మైనార్టీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఫక్రుద్దీన్, పీసీసీ సభ్యులు కృష్ణారెడ్డి, మధిర నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తదితరులు భట్టి విక్రమార్కను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.