Bifarjoy | విపర్యయ్‌ బీభ‌త్సం.. 1000 గ్రామాల‌కు నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రా

Bifarjoy | విధాత: అతి తీవ్ర తుఫాను విపర్యయ్‌ గుజ‌రాత్ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి క‌చ్ ప్రాంతంలోని ల‌ఖ్‌ప‌త్ స‌మీపంలో తీరాన్ని తాకిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. తుఫాను తీరం తాక‌డంతో.. భీక‌ర గాలులు వీస్తున్నాయి. క‌చ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తోంది. తుఫాను తీరాన్ని దాటే స‌మ‌యంలో గంట‌కు 185 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. In Deodar in north #Gujarat, trees and electricity pylons fell due […]

  • By: krs    latest    Jun 16, 2023 10:12 AM IST
Bifarjoy | విపర్యయ్‌ బీభ‌త్సం.. 1000 గ్రామాల‌కు నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రా

Bifarjoy |

విధాత: అతి తీవ్ర తుఫాను విపర్యయ్‌ గుజ‌రాత్ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి క‌చ్ ప్రాంతంలోని ల‌ఖ్‌ప‌త్ స‌మీపంలో తీరాన్ని తాకిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. తుఫాను తీరం తాక‌డంతో.. భీక‌ర గాలులు వీస్తున్నాయి. క‌చ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తోంది. తుఫాను తీరాన్ని దాటే స‌మ‌యంలో గంట‌కు 185 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

విప‌రీత‌మైన ఈదురుగాలులు, కుండ‌పోత వ‌ర్షం కార‌ణంగా 1000 గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీలైనంత త్వ‌ర‌గా విద్యుత్ స‌ర‌ఫరాను పున‌రుద్ధ‌రిస్తామ‌ని అధికారులు తెలిపారు. తుఫాను కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. 23 మంది గాయ‌ప‌డిన‌ట్లు పేర్కొన్నారు.