బుల్లితెరపై మెగా బ్రదర్స్ పోటీ.. బ్రో వర్సెస్ వాల్తేరు వీరయ్య రచ్చ ఎలా ఉంటుందో..!

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నా కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్‌పై పోటి పడింది లేదు.
అయితే బుల్లితెరపై మాత్రం తొలిసారి పోటీ పడబోతున్నారు. ఈ ఇద్దరు హీరోల పోటీ ఆసక్తికరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్యతో పాటు పవన్ కళ్యాణ్ బ్రో మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్స్ ఖరారు చేస్తూ తేది కూడా రివీల్ చేశారు . దసరా సందర్భంగా అక్టోబర్ 19న ఈ రెండు సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ కాబోతున్నట్టు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో బ్రో అనే చిత్రం తెరకెక్కగా, ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం మంచి సక్సెస్ దక్కించుకుంది. అయితే బ్రో మూవీ ఇప్పుడు జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతుండగా, దీని కోసం ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అదే రోజు చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ జెమిని టీవీలో ప్రీమియర్ కానుంది. రెండు సినిమాలు ఒకే రోజు…ఒకే టైమ్‌లో టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తుంది. తొలిసారి అన్నదమ్ములు ఇలా బుల్లితెరపై పోటీకి దిగనుండడంతో ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని బ్రో చిత్రం తెరకెక్కించగా, ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, అలీ రెజా కీలకపాత్రలలో నటించారు.
మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఇక చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజ్ కాగా, ఈచిత్రం బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మూవీలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించారు. రవితేజ పాత్ర కొంచెం అయిన కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించింది.