చ‌ప్ప‌గా సాగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌.. ఈ వారం నామినేష‌న్స్‌లో ఎంత మంది ఉన్నారంటే..!

  • By: sn    latest    Oct 03, 2023 2:09 AM IST
చ‌ప్ప‌గా సాగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌.. ఈ వారం నామినేష‌న్స్‌లో ఎంత మంది ఉన్నారంటే..!

బిగ్ బాస్‌లో మండే వ‌చ్చిందంటే ఆ మజానే వేరు. నామినేష‌న్స్‌కి సంబంధించి ఒకరినొక‌రు తిట్టుకోవ‌డం, హౌజ్‌లో నానా ర‌చ్చ చేయ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌కి సంబంధించి ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకుని వారిని స‌రైన కార‌ణాల‌తో నామినేట్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశిస్తాడు.



నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా నామినేట్ చేయాల‌ని అనుకున్న వారిని వారి మెడ‌లో ఉన్న షీటుపై క‌త్తితో పొడ‌వాల్సి ఉంటుంది. అయితే టేస్టీ తేజ డైరెక్ట్‌గా నామినేట్ అయిన క్ర‌మంలో అత‌డిని నామినేట్ చేయ‌న‌క్కర్లేదు అని బిగ్ బాస్ తెలియ‌జేశారు.అయితే ముందుగా శివాజికి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో పాల్గొనే చాన్స్ బిగ్ బాస్ ఇవ్వ‌గా, అత‌ను అమ‌ర్‌దీప్‌ని నామినేట్ చేశాడు. ఇందులో ‘జులాయి’ సినిమాలో బ్యాంక్ రాబరీ స్టోరీ చెబుతూ అమర్‌దీప్ కిగ‌ట్టిగా ఇచ్చి ప‌డేశాడు.



ఆ త‌ర్వాత ప్రియాంకని నామినేట్ చేస్తూ.. నువ్వు నా విష‌యంలో చేయ గుడ్డిగా ఎత్త‌డం న‌చ్చ‌లేదని కార‌ణం చెప్పాడు. ఇక ఆ తర్వాత వంతు ప్రియాంకకు రాగా, ఆమె వెంటనే శివాజీని నామినేట్ చేసేసింది. అలాగే సెకండ్ నామినేషన్‌గా ప్రిన్స్‌ యావర్‌ను ఎంచుకుంది. అయితే నామినేష‌న్‌కి సంబంధించి ప్రియాంక చెప్పిన కార‌ణాల‌కి శివాజీ ఏకీభ‌వించ‌లేదు.


అనంత‌రం గౌత‌మ్ మొద‌ట అమ‌ర్ ని నామినేట్ చేస్తూ.. నువ్వు ఓట‌మిని అంగీక‌రించ‌క‌పోవ‌డం న‌చ్చ‌లేదు అని అన్నాడు. ఇక త‌ర్వాత శివాజీని నామినేట్ చేస్తూ.. ‘స్మైలింగ్ ఛాలెంజ్ గేమ్‌లో తేజ నన్ను బెల్టుతో కొడుతుంటే మీరు ఒక్క మాట కూడా అనకపోవడం నాకు స‌రిగా అనిపించ‌లేదు అని గౌత‌మ్ చెప్పుకొచ్చాడు.



ఇక ఆ త‌ర్వాత శుభశ్రీ ఛాన్స్ రాగా, ఆమె అమ‌ర్, ప్రియాంక‌ల‌ని నామినేట్ చేసింది. బయాస్ అని చెప్పి నా టాలెంట్‌ని హర్ట్ చేశారని శుభశ్రీ చెప్పుకొచ్చింది. ఇక యావర్ ఛాన్స్ రాగా అత‌డు.. అమర్‌ దీప్‌, ప్రియాంకలను నామినేట్‌ చేశాడు. ఇక అమర్‌ దీప్‌.. శుభ శ్రీ, శివాజీలను నామినేట్ చేస్తూ త‌గు కార‌ణాల‌ని చెప్పుకొచ్చాడు.


ఇక తేజ.. గౌతమ్‌, యావర్‌లను నామినేట్‌ చేశాడు. నాలుగు వారాలైన కూడా ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్ కాలేద‌నే కార‌ణంగా బిగ్ బాస్ డైరెక్ట్‌గా తేజ‌, శివాజి, శుభశ్రీ, యావ‌ర్, అమ‌ర్ దీప్, ప్రియాంక‌, గౌత‌మ్‌ల‌ని ఎలిమినేష‌న్‌కి సంబంధించిన నామినేష‌న్ చేశారు. వీరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌ని వీడి వెళ్ల‌నున్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా చ‌ప్ప‌గా సాగింద‌నే చెప్పాలి. ఎవ‌రు కూడా స‌రైన కార‌ణాలు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.