Biporjoy | ప‌శ్చిమ తీరాన్ని వ‌ణికిస్తున్న బిపర్‌జాయ్‌.. ఓ చిన్నారికి అదే పేరు నామ‌క‌ర‌ణం..

Biporjoy విధాత‌: త‌ల్లిదండ్రులు ట్రెండ్‌కు తగ్గ‌ట్టు త‌మ పిల్ల‌ల‌కు పేర్ల‌ను నామ‌క‌ర‌ణం చేస్తుంటారు. అయితే తమకు న‌చ్చిన దేవుడి పేరు మీద‌నో, లేదంటే అభిమానుల పేర్లు క‌లిసేలా పేర్ల‌ను పెడుతుంటారు. ఇక త‌మ పిల్ల‌లు పుట్టిన స‌మ‌యంలో ఏదైనా విప‌త్తు సంభ‌వించినా లేదా ప్ర‌జా సంక్షేమం కోసం గొప్ప కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. వాటికి పెట్టిన పేర్ల‌ను త‌మ పిల్ల‌ల‌కు కూడా అవే పేర్ల‌ను నామ‌క‌ర‌ణం చేస్తుంటారు. అయితే పెద్ద పెద్ద తుఫాన్‌లు, భారీ ప్ర‌కృతి విపత్తుల‌కు వాతావ‌ర‌ణ […]

Biporjoy  | ప‌శ్చిమ తీరాన్ని వ‌ణికిస్తున్న బిపర్‌జాయ్‌.. ఓ చిన్నారికి అదే పేరు నామ‌క‌ర‌ణం..

Biporjoy

విధాత‌: త‌ల్లిదండ్రులు ట్రెండ్‌కు తగ్గ‌ట్టు త‌మ పిల్ల‌ల‌కు పేర్ల‌ను నామ‌క‌ర‌ణం చేస్తుంటారు. అయితే తమకు న‌చ్చిన దేవుడి పేరు మీద‌నో, లేదంటే అభిమానుల పేర్లు క‌లిసేలా పేర్ల‌ను పెడుతుంటారు. ఇక త‌మ పిల్ల‌లు పుట్టిన స‌మ‌యంలో ఏదైనా విప‌త్తు సంభ‌వించినా లేదా ప్ర‌జా సంక్షేమం కోసం గొప్ప కార్య‌క్ర‌మాలు జ‌రిగినా.. వాటికి పెట్టిన పేర్ల‌ను త‌మ పిల్ల‌ల‌కు కూడా అవే పేర్ల‌ను నామ‌క‌ర‌ణం చేస్తుంటారు.

అయితే పెద్ద పెద్ద తుఫాన్‌లు, భారీ ప్ర‌కృతి విపత్తుల‌కు వాతావ‌ర‌ణ శాఖ కొన్ని పేర్ల‌ను నిర్ణ‌యిస్తుంది. ఆ పేర్లు కొత్త‌గా ఉండ‌టంతో.. అదే పేర్ల‌ను పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌కు నామ‌క‌ర‌ణం చేస్తుంటారు.

తాజాగా ప‌శ్చిమ తీరాన్ని వ‌ణికిస్తున్న బిపోర్ జాయ్ తుపాను పేరును ఓ దంప‌తులు త‌మ బిడ్డ‌కు నామ‌క‌ర‌ణం చేశారు. స‌రిగ్గా నెల రోజుల క్రితం ఆ చిన్నారి జ‌న్మించింది. గుజ‌రాత్‌కు చెందిన ఈ దంప‌తుల‌ను బిపోర్ జాయ్ తుపాను వెంటాడుతుండ‌టంతో.. ప్ర‌స్తుతం క‌చ్ జిల్లాలోని జ‌ఖౌలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పున‌రావాస కేంద్రంలో ఆశ్ర‌యం పొందుతున్నారు.

ఈ క్ర‌మంలో ఈ ఘ‌ట‌న గుర్తుండిపోయే విధంగా త‌మ బిడ్డ‌కు బిపోర్‌జాయ్ అనే తుపాను పేరును నామ‌క‌ర‌ణం చేసి వార్త‌ల్లో నిలిచారు. తాజా తుపానుకు బిపోర్‌జాయ్ అని బంగ్లాదేశ్ నామ‌క‌ర‌ణం చేసిన సంగ‌తి తెలిసిందే. బెంగాలీలో బిపోర్‌జాయ్ అంటే విప‌త్తు లేదా ఉప‌ద్ర‌వం అని అర్థం.