విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయినా బీజేపీ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ సంస్థా గత మార్పులను చేపట్టింది. ఒకేసారి 12 జిల్లాల అధ్యక్షులను మార్చి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులలో నిజామాబాద్ జిల్లాకు దినేష్ కుమార్, పెద్దపల్లికి చందుపట్ల సునీల్, సంగారెడ్డికి గోదావరి అంజిరెడ్డి, సిద్ధిపేటకు మోహన్ రెడ్డి, యాదాద్రి భువనగిరికిపాశం భాస్కర్, వనపర్తికి డి.నారాయణను, వికారాబాద్ కు, మాధవరెడ్డిని, నల్గొండకు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డినీ, ములుగుకు బలరాం, మహబూబ్ నగర్ కు పీ.శ్రీనివాస్ రెడ్డినీ, వరంగల్ కు గంట రవిని, నారాయణపేటకు జలంధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
అలాగే పార్టీకి అనుబంధంగా ఉండే ఆరు మోర్చాల అధ్యక్షులను ప్రకటించారు. ఎస్టీ మోర్చాకు కల్యాణ్ నాయక్, ఎస్సీ మోర్చా కు కొండేటి శ్రీధర్, యువ మోర్చాకు మహేందర్, ఓబీసీ మోర్చాకు ఆనంద్ గౌడ్, మహిళ మోర్చాకు డాక్టర్ శిల్పా, కిసాన్ మోర్చాకు పెద్దోళ్ల గంగారెడ్డిలను నియమించారు.