DK Aruna
విధాత: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూతురు శ్రుతి రెడ్డిని ఆమె కారు డ్రైవర్ బురిడీ కొట్టించిన ఉదంతం వెలుగుచూసింది.శృతిరెడ్డికి తెలియకుండా ఆమె క్రెడిట్ కార్డును దొంగిలించి ఏకంగా 11లక్షల మేరకు దర్జాగా వాడుకున్నాడు.
డ్రైవర్‌గా తను రోజు ఆమెను రకరకాల ప్రాంతాలకు, షాపింగ్ మాల్స్‌కు తీసుకెళ్లేవాడు.. ఓ రోజు మాత్రం తన కన్ను ఆమె క్రెడిట్ కార్డు మీద పడింది. ఆమె గమనించని సమయంలో మెల్లగా క్రెడిట్ కార్డును లేపేశాడు.
ఆ కార్డుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయాన్ని చాలా లేట్‌గా గమనించిన శ్రుతి రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.