సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేతలు

మక్తల్‌, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేతలు

విధాత, హైదరాబాద్‌ : మక్తల్‌, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డిలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్లమెంటు ఎన్నికల వేళ వారిద్దరు కాంగ్రెస్‌లో చేరడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.