Border Disputes | సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

Maharashtra - Karnataka Border Disputes | పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బుధవారం కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేంది. మహారాష్ట్ర - కర్ణాటక సరిహద్దు వివాదం నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో మహారాష్ట్ర బస్సులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసుశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని రవాణాశాఖ ధ్రువీకరించింది. ప్రయాణికులు, బస్సుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పోలీసుశాఖ […]

  • Publish Date - December 7, 2022 / 01:59 AM IST

Maharashtra – Karnataka Border Disputes | పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బుధవారం కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేంది. మహారాష్ట్ర – కర్ణాటక సరిహద్దు వివాదం నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో మహారాష్ట్ర బస్సులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసుశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని రవాణాశాఖ ధ్రువీకరించింది. ప్రయాణికులు, బస్సుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పోలీసుశాఖ ఆదేశాల తర్వాతే సేవలను పునః ప్రారంభించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర – కర్ణాటక వివాదంపై కేంద్రమంత్రి అమిత్‌షాతో మాట్లాడుతానని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు.

అలాగే మంగళవారం జరిగిన ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. శరద్‌ పవార్‌ కర్ణాటక వెళ్లాల్సిన అవసరం లేదని, వివాదంతో అమిత్‌షాతో మాట్లాడానని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని, సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని కోరారు. తమ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడుకోవడం కర్ణాటక బాధ్యత అని, ఇలాంటి సంఘటనలు సరికావన్నారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడం, ధ్వంసం చేయడం సరికాదన్నారు. కర్ణాటక సరిహద్దుకు సంబంధించినంత వరకు మా వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేస్తామని బొమ్మై ట్వీట్‌ చేశారు.