డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌ను అడ్డుకున్న బీఎస్ఎఫ్‌

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) డ్ర‌గ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్న‌ది.

డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌ను అడ్డుకున్న బీఎస్ఎఫ్‌
  • పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ముగ్గురి అరెస్టు
  • 525 గ్రాముల హెరాయిన్ స్వాధీనం


విధాత‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) డ్ర‌గ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్న‌ది. హెరాయిన్‌తో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసింది. ఆదివారం స్మగ్లర్ల నుంచి 525 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.


అంతకుముందు బీఎస్ఎఫ్‌, పంజాబ్ పోలీసులు, జాయింట్ ఆపరేషన్‌లో ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని విలేజ్ భైని రాజ్‌పుతానాకు ఆనుకుని ఉన్న వ్యవసాయ క్షేత్రం నుంచి డ్రోన్ ద్వారా వ‌చ్చిన‌ హెరాయిన్ డ్ర‌గ్ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్‌ చైనా తయారు చేసిన ‘క్వాడ్‌కాప్టర్’ 3 క్లాసిక్ మోడల్ అని, అందులో దాదాపు 540 గ్రాముల హెరాయిన్ ఉన్నట్టు బీఎస్ ఎఫ్ వెల్లడించింది.


ఈ నెల 23న ఉదయం సమయంలో నిర్దిష్ట సమాచారం మేర‌కు అమృత్‌సర్ జిల్లా భైని రాజ్‌పుతానా గ్రామ శివార్లలో బీఎస్ ఎఫ్‌, పంజాబ్‌ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేప‌ట్టి సుమారు అర‌కిలో హెరాయిన్ ప్యాకెట్‌తోపాటు డ్రోన్ స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపింది.