Chiru-Balayya | చిరంజీవి, బాలయ్య.. ఎందులోనూ తగ్గట్లే..! అమెరికాలో ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్‌

Chiru-Balayya విధాత‌: కాస్త విరామం దొరికితే ఏదైనా ప్రసాంతమైన ప్రదేశానికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని, తరచుగా విదేశాలకు వెళ్లిపోతుంటారు తారలు. దొరికిన కాస్త టైమ్‌ని విదేశాల్లో కాస్త ప్రైవసీతో సరదాగా గడప వచ్చనేది వాళ్ళ ఆలోచన. మాట్లాడితే కుటుంబంతో సహా విదేశాలకు పోయి అక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళలో మన టాలీవుడ్ స్టార్స్ నుంచి కొందరు హీరోలు ముందుంటారు. ఇందులో ముఖ్యంగా మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా షూటింగ్స్‌తో బిజీగా గడిపేస్తూనే.. కాస్త గ్యాప్ వస్తే […]

Chiru-Balayya | చిరంజీవి, బాలయ్య.. ఎందులోనూ తగ్గట్లే..! అమెరికాలో ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్‌

Chiru-Balayya

విధాత‌: కాస్త విరామం దొరికితే ఏదైనా ప్రసాంతమైన ప్రదేశానికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని, తరచుగా విదేశాలకు వెళ్లిపోతుంటారు తారలు. దొరికిన కాస్త టైమ్‌ని విదేశాల్లో కాస్త ప్రైవసీతో సరదాగా గడప వచ్చనేది వాళ్ళ ఆలోచన. మాట్లాడితే కుటుంబంతో సహా విదేశాలకు పోయి అక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళలో మన టాలీవుడ్ స్టార్స్ నుంచి కొందరు హీరోలు ముందుంటారు. ఇందులో ముఖ్యంగా మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా షూటింగ్స్‌తో బిజీగా గడిపేస్తూనే.. కాస్త గ్యాప్ వస్తే చాలు విదేశాలకు హాలిడే ట్రిప్స్ వేస్తుంటారు.

ఇక హీరోయిన్స్ కూడా బాగానే విదేశాల్లో షాపింగ్స్‌తో ఎంజాయ్ చేసి వస్తారు. వీళ్ళందరిలోకి మహేష్ కాస్త ఎక్కువగా అంటే షూటింగ్‌కి చిన్న గ్యాప్ వచ్చినా విదేశాలకు చెక్కేస్తుంటాడు. అదీ ఫ్యామిలీతో సహా వెళ్లి.. కాస్త రిలాక్స్ అయ్యి అప్పుడు తిరిగి వస్తాడు.

అయితే తాజాగా చిరంజీవి ఆయన సతీమణి సురేఖ విదేశాలకు వెళ్ళారు. అలాగే బాలయ్య, ఆయన భార్య వసుంధర కూడా విదేశాల్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. సీనియర్ హీరోలు ఇద్దరూ ఇలా భార్యలతో కలిసి అమెరికా వెళ్ళడం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ కలిసి ఒకేసారి అమెరికా ప్రయాణం కట్టక పోయినా.. ప్రస్తుతం చిరంజీవి, బాలయ్య ఇద్దరూ అమెరికాలోనే ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేస్తున్నారు.

బాలయ్య.. రెండో కుమార్తె, కొడుకుతో అమెరికా సభలలో పాల్గొనేందుకు‌ వెళ్ళగా, ఇక చిరంజీవి మాత్రం భార్య సురేఖతో కాస్త రిఫ్రెష్ అయ్యి వచ్చేందుకు వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాకనే తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ ఉంటుందని సమాచారం. ఇక బాలయ్యకు అమెరికా టూర్ కాగానే ‘భగవత్ కేసరి’ బ్యాలెన్స్ షూట్‌లో పాల్గొంటారని తెలుస్తుంది.

ఇలాంటి టూర్స్ అప్పుడుప్పుడు వేయకపోతే షూటింగ్స్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే. పైగా ఫ్యామిలీతో గడిపే వీలు కూడా ఇలా రిలాక్స్ అయినపుడే తప్పితే ఈ సినిమా వాళ్ళకి అస్తమానూ దొరకదు కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. సినిమాల విషయంలో పోటీ పడే ఈ ఇద్దరూ.. ఇలా వెకేషన్స్‌లోనూ పోటీ పడుతుండటమే హాట్ టాపిక్ అవుతోంది. ఏదిఏమైతేనేం.. చిరు, బాలయ్య రిలాక్స్ అవుతున్నారు. అది చాలు ఫ్యాన్స్‌కి.