BRS | సోషల్ మీడియాపై బీఆర్ఎస్ ఫోకస్
BRS లోపం సరిదిద్దుకునే ప్రయత్నం సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనాలు సంక్షేమం, అభివృద్ధి పై ప్రచారం విపక్ష విమర్శలకు సమాధానం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ పై ఫోకస్ చేసింది. ఇంతకాలం జరిగిన లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేపట్టింది. ప్రధానంగా బీజేపీ సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రధాన నాయకత్వం పర్యవేక్షణలో అమలుచేస్తున్నారు. […]

BRS
- లోపం సరిదిద్దుకునే ప్రయత్నం
- సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనాలు
- సంక్షేమం, అభివృద్ధి పై ప్రచారం
- విపక్ష విమర్శలకు సమాధానం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ పై ఫోకస్ చేసింది. ఇంతకాలం జరిగిన లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేపట్టింది. ప్రధానంగా బీజేపీ సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రధాన నాయకత్వం పర్యవేక్షణలో అమలుచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్వీయ నేతృత్వంలో ఈ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది.
సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా కమిటీలతో ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. తర్వాత నర్సంపేట, పరకాలలో అవగాహన సదస్సులు జరిపారు. నర్సంపేటలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు సోషల్ మీడియా బాధ్యడు సతీష్‌రెడ్డి తన టీమ్ బృందం తదితరులు పాల్గొన్నారు.
కేడర్‌కు పథకాలపై అవగాహన
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని సోషల్ మీడియాలో మరింత ప్రచారం ఎలా చేయాలనే అంశాలపై వివరిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, అందుకు గ్రామాలవారీగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించూకునేందుకు అవసరమైన ప్రాథమిక స్థాయి అవగాహన అందిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరింత వేగం పెంచాలనే లక్ష్యంగా సాగుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా యూత్ సమావేశాలు సాగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రీకరణ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో పూర్తి పట్టణ ప్రాంత నియోజకవర్గాలుగా వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలున్నాయి. మిగిలిన వాటిల్లో ములుగు, భూపాలపల్లి, మానుకోట, జనగామ జిల్లా కేంద్రాలతో కూడిన నియోజకవర్గాలుండగా మిగిలిన డోర్నకల్, పాలకుర్తి, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట సెగ్మెంట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలతో కూడుకుని ఉన్నాయి.
సంక్షేమ, అభివృద్ధి పై ప్రచారం
నియోజకవర్గాల వారీగా ఏర్పాటు అభివృద్ధి, సంక్షేమం వివరించేలా ప్లాన్ గ్రామాల వారీగా సోషల్ మీడియా గ్రూపులను వినియోగించుకుని రానున్న ఎన్నికలకు అధికార గులాబీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఎన్నికలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ విభాగం పై కేంద్రీకరించి పనిచేస్తున్నారు.
విపక్ష విమర్శలకు సమాధానం
రానున్న ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమైనందున ఏ చిన్న అవకాశం జారవిడిచినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాయకత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు సంసిద్ధం చేస్తున్నారు.