BRS | బావను.. ఎంత పొగిడినా మామకే జై కొట్టిన అల్లుడు హరీష్

BRS మూడోసారి BRS పార్టీ అధికారంలోకి వ‌స్తుంది.. సీఎంగా KCR కావడం ఖాయమని మంత్రి హరీష్‌రావు హరీష్ రావు అభివృద్ధి కాముకుడు: మంత్రి KTR విభేదాలు వీడినట్టేనా… విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: నిన్న మొన్నటి వరకూ ఉప్పు.. నిప్పుగా ఉన్న బావబమ్మర్దులు ఒకరినొకరు కౌగలించుకొని పొగుడుకుంటుంటే బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. వారు ఎవరనుకుంటున్నారు? ఇది ఎక్కడ జరిగింది. ఎవరా బావబమర్దులు.. తెలుసుకుందాం రండి… తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాదు… తెలంగాణ […]

  • Publish Date - June 16, 2023 / 01:24 PM IST

BRS

  • మూడోసారి BRS పార్టీ అధికారంలోకి వ‌స్తుంది..
  • సీఎంగా KCR కావడం ఖాయమని మంత్రి హరీష్‌రావు
  • హరీష్ రావు అభివృద్ధి కాముకుడు: మంత్రి KTR
  • విభేదాలు వీడినట్టేనా…

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: నిన్న మొన్నటి వరకూ ఉప్పు.. నిప్పుగా ఉన్న బావబమ్మర్దులు ఒకరినొకరు కౌగలించుకొని పొగుడుకుంటుంటే బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. వారు ఎవరనుకుంటున్నారు? ఇది ఎక్కడ జరిగింది. ఎవరా బావబమర్దులు.. తెలుసుకుందాం రండి…

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాదు… తెలంగాణ (క్యాబినెట్ ) మంత్రి వర్గంలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్న బీఆర్ ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటి రామారావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావులు సిద్దిపేటలో గురువారం జరిగిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికైంది. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాలలో మార్పులకు నాందిగా చెప్పచ్చు.

ఐతే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మొదలుకొని, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు సమయం, వేదిక దొరికి నప్పుడల్లా కేటీఆర్ ను సీఎంగా చూడాలని అంటుంటారు. కానీ సిద్దిపేటలో అందుకు భిన్నంగా జరిగింది. ఐటీ మినిస్టర్ గా దేశ యువత కేటీఆర్ ను కోరుకుంటుంది. ఐటి పెట్టుబడులు తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు కేటి రామారావు ను తన ప్రసంగంలో ఆకాశానికి ఎత్తారు.

అదేవిధంగా బావ హరీష్ రావు అభివృద్ధి కాముకుడు, సిద్దిపేట అభివృద్ధి తెలంగాణకే రోల్ మోడల్ గా చేసిన వ్యక్తి తన బావ హరీష్ రావు అని కేటీఆర్ అని తన ప్రసంగంలో పొగిడారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో హరీష్ రావు ను లక్షా యాభై వేల మే జారిటితో గెలిపించాలని కేటీఆర్ సిద్దిపేట ప్రజలను కోరారు. బావ హరీష్ రావు ను ఎంత పొగిడినా చివరకు మామ కేసిఆర్ కే హరీష్ మద్దతు తెలిపారు. 3 వసారి తెలంగాణలో బీఆర్ యస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ సీఎంగా ఉంటారని హరీష్ రావు ప్రకటించడం కొసమెరుపు.

ఉస్నాబాద్ సభతోనే.. మనస్పర్థలు….

ఇటీవల ఉస్నాబాధ్ నియోజక వర్గంలో మంత్రి హరీష్ రావు ను కాదని మంత్రి కేటీఆర్ అక్కడి ఎమ్మెల్యే సతీష్ తో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు లేకుండా కార్యక్రమం చేయడం అసంతృప్తికి దారి తీసిందని పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ ఇద్దరి నేతల మధ్య బంధువులు కలిపించుకొని సయోధ్య కుదిర్చినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్ర రాజకీయాలలో వస్తున్న మార్పులకు ఈ సంఘటన ఉదాహ‌ర‌ణ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగిందని అందుకు అనుగుణంగా బీఆర్ యస్ లో బావ బామ్మర్ధు లకు అంగీకారం కుదిరినట్లలేనని అంటున్నారు.

ఎన్నికల వరకు పార్టీలో మార్పులకు అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఏది ఏమైనా బామ్మర్ది కేటిఅర్ సీఎం కల పై హరీష్ రావు నీళ్ళు చల్లినట్లు అయింది… ఎన్నికల వరకు ఎలాంటి మార్పు లు ఉంటాయోనని కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.