BRS
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో నిర్వహించిన BRS ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది.
మండలంలోని కంచల తండా గ్రామానికి చెందిన ధీరావత్ నాను నాయక్ అనే BRS కార్యకర్త సమ్మేళనంలో గుండెపోటుతో కుప్పకూలగా, తోటి కార్యకర్తలు ఆసుపత్రికి తరలించే క్రమంలోనే అతను మృతి చెందాడు.
BRS ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. గుండెపోటుతో కార్యకర్త మృతి! https://t.co/orDqECnSGH #TELANGANA #BRS #TRS #KTR @KTRBRS @TelanganaCMO #Telugu pic.twitter.com/xgrGqbHrFV
— vidhaathanews (@vidhaathanews) April 21, 2023
గతంలోనూ ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ఆయన వెంట వచ్చిన గ్రామస్తుల కథనం. BRS ఆత్మీయ సమ్మేళనానికి ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. నాను నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.