BRS, ZPTC
విధాత: నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌కి షాక్ తగిలింది. సారంగపూర్ మండలానికి చెందిన అధికార పార్టీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసంలో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డా.తేజావత్ బెల్లయ్య నాయక్,TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అద్దంకి దయాకర్ & సత్తు మల్లేష్ గార్ల నేతృత్వంలో నిర్మల్ జిల్లా ZPTC ల సంఘం అధ్యక్షులు అధికార BRS పార్టీ సారంగపూర్ మండల ZPTC పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. pic.twitter.com/VSsXoU9vED
— Telangana Congress (@INCTelangana) April 17, 2023
ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా జెడ్పీటీసీల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.